Monday, May 6, 2024

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు..

తప్పక చదవండి
  • కొత్త సీట్ల అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల జాప్యం..
  • ఒకటి రెండు రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
  • ఒక ప్రకటనలో తెలిపిన తెలంగాణ ఉన్నత విద్యామండలి..

హైదరాబాద్, 06 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్టు ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, శనివారం ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించారు. ఈనెల 9న ఇంజినీరింగ్ అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ఈనెల 12 వరకు పొడిగించారు. ఈనెల 16న తొలివిడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈనెల 24 నుంచి రెండో విడత కౌన్సెలింగ్.. ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. కొత్తగా తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డంతో పాటు ఒకటి రెండు రోజుల్లో ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు కూడా విడుద‌ల కానున్నాయి. రాష్ట్రంలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది. ఫలితంగా అదనపు సీట్లతో ఏటా సర్కారుపై రూ.27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజా అనుమతిచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671 చేరింది.

ఈ నేప‌థ్యంలో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు చేశారు. అర్హ‌త క‌లిగిన విద్యార్థులంద‌రూ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల‌నే ఉద్దేశంతో స్వ‌ల్ప మార్పులు చేసిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

ఫ‌స్ట్ ఫేజ్ షెడ్యూల్ :
జులై 7, 8 – ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది. జులై 9 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. జులై 12 వ‌ర‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. జులై 12 – ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి. జులై 16 – సీట్ల కేటాయింపు.
జులై 16 – 22 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

సెకండ్ ఫేజ్ షెడ్యూల్ :
జులై 24, 25 – ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది.. (ఫ‌స్ట్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్ర‌మే). జులై 26 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. జులై 24 – జులై 27 – స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. జులై 27 – ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి. జులై 31 – సీట్ల కేటాయింపు.. జులై 31– ఆగ‌స్టు 2 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఫైన‌ల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ :
ఆగ‌స్టు 4 – ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది.. (ఫ‌స్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్ర‌మే). ఆగ‌స్టు 5 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.. ఆగ‌స్టు 4 – ఆగ‌స్టు 6– స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.. ఆగ‌స్టు 6 – ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి. ఆగ‌స్టు 9 – సీట్ల కేటాయింపు. ఆగ‌స్టు 9 – ఆగ‌స్టు 11 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు