Monday, April 29, 2024

‘ఆదాబ్ హైదరాబాద్’ కథనంపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం..

తప్పక చదవండి
  • పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు..
  • తర్జన భర్జనలో జిల్లా ఉన్నతాధికారులు..
  • ఆగ మేఘాల మీద నివేదిక పంపిన ఉన్నతాధికారులు..
  • భవనంలో ఈవిఎంలా.? ఐటి హబ్బా.? అనేది చర్చించి చెప్తాం : జిల్లా కలెక్టర్.
  • పాత కలెక్టరేట్ భవనం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందంటూ సమాధానం..

ఎట్టకేలకు ఆదాబ్ కథనానికి ఎన్నికల సంఘం అధికారులు స్పందించారు.. ‘ సూర్యాపేటలో ఈవీఎం లు భద్రపరచిన చోట ఐటీ హబ్ ఏర్పాటు దేనికి సంకేతం ‘ పేరుతో ఒక కథనాన్ని ప్రచురించిన సంగతి విదితమే.. ఈ కథనం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సైతం తీవ్రంగా స్పందించారు.. అనుమానాలు వ్యక్తం చేశారు.. తక్షణమే ఐటీ హబ్ ను కానీ, ఈవీఎంలను కానీ అక్కడనుంచి తరలించాలని డిమాండ్ చేశారు..

హైదరాబాద్ : సూర్యాపేటలో ఈవీఎంలు భద్రపరచిన చోట ఐటి హబ్ ఏర్పాటు చేయడం దేనికి సంకేతం అనే వార్త కథనం పై ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ను పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం “ఆదాబ్ హైదరాబాద్” దినపత్రిక లో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్న అధికారులు తర్జన భర్జన పడుతూ నివేదిక తయారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ.. పేపర్లో వచ్చిన కథనంపై ఘాటుగా స్పందించారు.ఈ.వి.ఎం మిషన్ లు ఎక్కడ ఉండాలో అన్న విషయంపై సరిగా పత్రిక విలేకరులకు అవగాహన లేనట్లు ఉందంటూ వ్యంగంగా మాట్లాడారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి నివేదిక అందించామని అన్నారు. ఈ.సి నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఈవీఎం మిషిన్ లను వేరే ప్రాంతానికి తరలించడమా లేదా, ఐటీ హబ్ ను వేరే ప్రాంతానికి మార్చడం లాంటివి చేస్తామన్నారు. ప్రస్తుతం పాత కలెక్టరేట్ భవనం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

ధర్మార్జున్ తెలంగాణ జనసమితి సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి :
ఎలాంటి రక్షణ లేని ప్రైవేట్ బిల్డింగులో ఈ.వి.ఎం మిషన్ లు ఉంచడం ఆపేక్షనీయం, ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు పూర్తి విరుద్ధం, కొత్తగా మంత్రులు ఐటి హబ్ ఏర్పాటు చేశారు దీంతో టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయని జిల్లా ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అక్కడ ఉన్న ఈవీఎంలను గాని, లేదా ఐటి హబ్ ను గాని మార్చి, ఈవీఎంలు ఉన్న ప్రదేశం లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

పెద్దిరెడ్డి రాజా, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు :
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గోదాములలో ఉన్న ఈ.వి.ఎం లను ఐటి హబ్ లలో మార్చడం పట్ల జిల్లా ప్రజలలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.. ప్రజలతో నాయకులకు జేజేలు కొట్టించే అధికారులు కూడా జిల్లాలో ఉన్నారు. పొదుపు సంఘాలు పేరుతో, అధికార పార్టీ నాయకుల తరఫున డబ్బులు పంచే అధికారులు జిల్లా లో ఉన్నారు. గోదాంలో ఉన్న ఈవీఎంలను ఐటి హబ్ లోకి తరలించడం పట్ల మర్మమేంటి..? అని జిల్లా ప్రజలు చెవులు కోరుకుంటున్నారని, జిల్లా కలెక్టర్ కి విన్నవించుకునేది ఏందంటే ఎక్కడి నుంచి వచ్చిన ఈవీఎంలను అక్కడికే తరలించి భద్రత ఏర్పాటు చేసి, ప్రజలలో ఉన్న అపోహను తొలగించాలని కోరారు. జిల్లా ప్రజల్లో ఉన్న అపోహలను నిస్ఫూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ కు, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉందంటూ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు