Saturday, April 27, 2024

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌..

తప్పక చదవండి
  • 71వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాల నేపథ్యంలో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం 70,165.49 పాయింట్ల వద్ద మొదలైంది. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి సెషన్‌లో సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 70,000.60 పాయింట్ల కనిష్ఠానికి చేరగా.. గరిష్ఠంగా 71,149.61 పాయింట్లకు పెరిగింది. చివరకు 689.76 పాయింట్లు పెరిగి 71,060.31 పాయింట్ల వద్ద స్థిరపడిరది. నిఫ్టీ 215.20 పాయింట్లు పెరిగి 21,454 వద్ద ముగిసింది. ట్రేడిరగ్‌లో దాదాపు 2,373 షేర్లు పురోగమించగా.. 1,288 షేర్లు క్షీణించాయి. మరో 81 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌, టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లాభాల్లో కొనసాగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నష్టపోయాయి. రంగాల్లో ఆటో, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌ స్టాక్‌ ఒకటి నుంచి రెండుశాతం వరకు పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పెరిగాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు