Saturday, June 15, 2024

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి : కోటి రెడ్డి ఐపిఎస్‌

తప్పక చదవండి
  • బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దు
  • ఎక్కడైనా మత్తు పదార్థాల అమ్ముతున్నట్టు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి
  • ప్రజల్ని కోరిన జిల్లా ఎస్పీ ఎన్‌.కోటి రెడ్డి ఐపిఎస్‌
    వికారాబాద్‌ జిల్లా: జిల్లాలోని యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల కొరకు శ్రమించాలని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ. కొందరు యువకులు ఈజీ మనీ కి అలవాటు పడి బెట్టింగ్‌, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. శ్రమించి సాదించాల్సిన విజయాలను మరిచి మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దయచేసి జిల్లా లోని యువకులు మత్తు జోలికి వెళ్ళవద్దు. తెలిసో,తెలియకనో,ఎవ్వరు చెప్పే వారు లేక మత్తు కు అలవాటు పడిన యువకులు ఎవరైనా ఉంటే వెంటనే దాని నుండి బయటకు రండి. వచ్చి మీ కలలను సాకారం చేసుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోండి. యువకులు ఇనుప నరాలు ఉక్కు కండరాలు కల్గి ఉండి తమ జీవిత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించి,తమ తల్లితండ్రులకు, తాము పుట్టిన ప్రాంతానికి మంచి పేరు తీసుకోని రావాలనీ జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.జిల్లా లోని యువకులు ఎవ్వరుకూడా మత్తు కు సంబందించిన వాటి దగ్గరకు వెళ్ళవద్దని పోలీస్‌ డిపార్ట్మెంట్‌ తరుపున ఏం చేస్తున్నామన్నారు.జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్‌ గుడుంబా మరే ఇతర మత్తు కు సంబందించిన వివరాలు గాని, వాటిని రవాణా చేసే వ్యక్తులు గాని ఉన్నట్లు అయినా అనుమానం ఉన్న వెంటనే తమ పరిధిలోని పోలీస్‌ అధికారులకు గాని, డైల్‌ 100 కు గాని, జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ అధికారులకు గాని తెలియజేయాలని ఎస్పీ కోరారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు