Saturday, May 18, 2024

గ్రంథాలయాలు జ్ఞాన నిలయాలు

తప్పక చదవండి
  • కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
    శామీర్‌ పేట : గ్రంథాలయాలు జ్ఞాన నిలయాలని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవర యంజాల్‌ లో దాదాపు రూ. 75లక్షల నిధులతో నిర్మాణం చేపడుతున్న నూతన గ్రంధాలయ భవన పనుల శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అలాగే శామీర్‌ పేట్‌ మండలం శామీర్‌ పేట్‌ గ్రామంలో 27 లక్షలతో గ్రంథాలయానికి మౌలిక వస్తులు, అలియాబాద్‌ గ్రామంలో దాదాపు రూ.65 లక్షల నిధులతో నిర్మాణం చేపడుతున్న నూతన గ్రంధాలయ భవన పనుల శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అనంతరం అలియాబాద్‌ గ్రామంలో సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి సందర్బంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాల వంటివని అన్నారు. గ్రంధాలయాలతో ప్రతి ఒక్కరికి విడదీయరాని అనుబంధం ఉంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నూతన గ్రంథాలయ భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జ్‌ రాజశేఖర్‌ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ దయాకర్‌ రెడ్డి, జిల్లా రైతు బందు అధ్యక్షులు నంద రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్‌ రాజేశ్వర్‌ రావు, ఎంపీపీ ఎల్లుబాయ్‌, డీసీఎంస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌ రెడ్డి, జడ్పీటీసీ అనిత, ఎంపీటీసీలు, సర్పంచ్‌ లు బలమని, కుమార్‌, కో అప్షన్‌ సభ్యులు, నాయకులు, మండల బి.ఆర్‌.ఎస్‌ పార్టీ అధ్యక్షులు సుదర్శన్‌, దేవరయంజల్లో మున్సిపాలిటీ చైర్మన్‌ రాజేశ్వర్‌ రావు, వైస్‌ చైర్మన్‌ వాణి వీర రెడ్డి, కౌన్సిలర్లు, కో అప్షన్‌ సభ్యులు, నాయకులు, మున్సిపాలిటీ టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు