Wednesday, May 22, 2024

కోర్టులంటే ఇతగాడికి లెక్కే లేదు..

తప్పక చదవండి
  • నిజాలను దాచి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన ఎస్‌ ఆర్‌ కన్‌ స్ట్రక్షన్స్‌ సంజీవరెడ్డి
  • కూల్చి వేయడానికి వచ్చిన అధికారులపై దాడికి యత్నం..
  • అధికారులు జారి చేసిన నోటీసు విషయం తెలుపని అక్రమార్కుడు..
  • చెరువులను అన్యాక్రాంతం చేస్తున్న అక్రమ నిర్మాణదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న అధికారులు..
  • ఎన్‌.జి.టి ఆదేశాలు బేఖాతర్‌ చేస్తున్న కమిటీ..
  • అమీన్‌ పూర్‌ చెరువులో నిర్మాణానికి రిజిస్ట్రేషన్లను చేస్తున్నా పట్టించుకోని కలెక్టర్‌..
  • ఎన్‌.జి.టి. ఆదేశాలు ఉల్లంఘించి హెచ్‌.ఎం.డి.ఏ. అనుమతులు ఇచ్చిన యాదగిరి రావుపై చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారు..?
  • హెచ్‌.ఎం.డి.ఏ. అనుమతుల రద్దుకు లేఖ రాశానని తెలిపిన అమీన్‌ పూర్‌ తహశీల్దార్‌ చెప్పిన మాటలు నిజమేనా..?
  • మాజీ మంత్రి మల్లారెడ్డికి ఒక రూలు.. సంజీవ రెడ్డికి మరొక రూలా..?
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వల్లూరి క్రాంతికి చెరువు కబ్జాపై శ్రద్ద చూపుతారా అన్నది ప్రశ్నార్థకమే..

ఇరిగేషన్‌ ఎన్‌.ఓ.సి. అవసరం లేదు.. చెరువును చెరబట్టడమే తెలుసు.. ఎస్‌.ఆర్‌. కన్స్‌ ట్రక్షన్స్‌ సంజీవ రెడ్డి మహా ముదురు.. హెచ్‌.ఎం.డి.ఏ. నుంచి అనుమతులు సంపాదించాడు.. చెరువులో అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నాడు.. ఇరిగేషన్‌ శాఖ అధికారులకు ఆదాయ వనరులుగా ఈ నిర్మాణాలు మారిపోయాయి.. అమీన్‌ పూర్‌ పెద్ద చెరువులో ఎఫ్టిఎల్‌, బఫర్‌ జోన్‌ లో యదేచ్ఛగా నిర్మాణాలు జరుగుతుంటే.. కేవలం తూ తూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు అవినీతి అధికారులు.. చర్యల పేరుతో కాలయాపన చేస్తూ.. దగ్గరుండి పనులు చేయిస్తున్న దారుణం ఇది.. ఇక సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ పాలన గాడి తప్పిపోయింది.. చెరువులు అన్యాక్రాంతం కావడానికి కారణం అధికారులే అంటున్నారు స్థానిక ప్రజలు.. చెరువులను పరిరక్షించే టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ నిద్ర పోతుందా..? ఏస్‌. ఆర్‌ కన్స్‌ ట్రక్షన్‌ యజమాని పడేసే ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయిందా..? ఇవే ఇప్పుడు సామాజిక వేత్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు.. మరి సమాధా నాలు ఎవరు చెబుతారు..? గతి తప్పుతున్న అక్రమ నిర్మాణాలను ఆపేదెవరు..? కనుమరుగై పోతున్న చెరువులను రక్షించే నాధుడు ఎవరు..? నీతిగా నడుచుకుం టున్న అధికారులపై దాడులు జరుగుతున్నా చట్టం ఏమి చేస్తోంది..? కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న అక్రమార్కుడైన సంజీవరెడ్డి ని కట్టడి చేసే వారెవరు..? పనులు ఆపవద్దంటూ కోర్టునుంచి ఆర్డర్స్‌ తెచ్చుకున్న ఇతగాడు ఇప్పటి ప్రభుత్వ పెద్దల పేరు చెప్పుకుని అక్రమ నిర్మాణాలను నిస్సిగ్గుగా చేస్తున్న వైనం ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా..?
గూగుల్‌ లో అక్రమ నిర్మాణాలు అని కొడితే అమీన్‌ పూర్‌ అని కనిపించే పరిస్థితులు నెలకొన్నాయి.. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే అవినీతికి వంతపాడుతుంటే.. మమ్మల్ని రక్షించే నాధుడే లేరా అంటూ చెరువులు కన్నీళ్లు పెడుతున్నాయి.. సంగారెడ్డి జిల్లాలోని, అమీన్‌ పూర్‌ మండలం, పెద్ద చెరువు ఎఫ్టీల్‌ బఫర్‌ జోన్లలో ఇరిగేషన్‌ ఏన్‌.ఓ.సి లేకుండానే.. భారీ భవనాలు నిర్మిస్తూ.. కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తూ కోట్లు కొల్లగొడు తున్నాడు ఏస్‌.అర్‌ కన్స్‌ ట్రక్షన్స్‌ సంజీవ రెడ్డి..
పెద్ద చెరువులోని, బఫర్‌ జోన్లలో దొడ్డి దారిన అనుమతులు పొంది.. యదేచ్ఛ గా నిర్మాణాలు చేస్తూ.. ప్రభుత్వానికే సవాలు విసురుతున్నాడు.. అక్రమ నిర్మాణ దారులు వేసే ఎంగిలి మెతుకు లకు ఆశపడిన అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.. దీంతో అతగాడు మరింత పెట్రేగి పోతున్నాడు.. యథే చ్ఛగా అక్రమ నిర్మాణ పనులు చేస్తూ.. కోట్లు కొల్లగొట్టి అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.. లంచాల మత్తులో జోగుతున్న అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లినా తూ తూ మంత్రంగా కేసులు నమోదు చేసి, చేతులు దులుపుకొని నిర్మాణాలను కట్టడి చేయకుండా.. తమ శక్తి వంచన లేకుండా అక్రమ నిర్మాణదారులకు సహకారం అందిస్తున్నారు..
నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. మాకేమీ కాదన్న ధీమాతో నిర్మాణ పనులు చేస్తున్నా, జిల్లా కలెక్టర్‌ కు లేఖ రాసినా..నేటి వరకు ఎలాంటి చర్యలు అమలు కాక పోవడంతో.. కలెక్టర్‌ వ్యవహార తీరు అనుమానా స్పదంగా కనిపిస్తోంది అంటూ ఆరోపిస్తున్నారు స్థానిక ప్రజలు.. ఎన్‌జిటి ఆదేశాలు అంటే సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు పట్టింపు లేదా అంటూ.. ప్రశ్నిస్తున్నారు పలువురు సామాజిక వేత్తలు.. గత ప్రభుత్వంలో బరి తెగించిన హెచ్‌.ఎం.డి.ఏ అధికారి యాదగిరి రావు అవినీతి, అక్రమాలే తన విధులు అన్న చందాన.. హెచ్‌.ఎం.డి.ఏ. లో ఎలాంటి ఎన్‌ఓసి లేకుండా దొడ్డిదారిన నిర్మాణ అనుమ తులు ఇచ్చి జేబులు నింపుకున్నాడు అన్నది అక్షర సత్యం.. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని అనుకంటే.. ఈ ప్రభుత్వంలోనూ జిల్లా కలెక్టర్‌ పట్టించుకోక పోవడం.. ఇరిగేషన్‌ డిఈ, ఏ.ఈ, ఈ.ఈ.లు సైతం మౌనంగా ఉండటం దారుణం.. అధికారుల ప్రవర్తన పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి.. అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చి.. ఈ ప్రభుత్వంలో ప్రజా పాలన జరుగుతుందని నిరూపించే విధంగా.. చర్యలు అమలు అయ్యేట్లు ఇరిగేషన్‌ శాఖా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వల్లూరి క్రాంతికి ఆదేశాలు జారీ చేయాలని.. అన్యాక్రాంతం అవుతున్న చెరువులను పరిరక్షించే విధంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.. అమీన్‌ పూర్‌ చెరువు కబ్జాల వ్యవహారంపై.. ఏస్‌.ఆర్‌ కన్స్‌ ట్రక్షన్‌ యజమాని అక్రమ నిర్మాణాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది.. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’.. ‘మా అక్షరం అవినీతి పై అస్త్రం’…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు