Wednesday, May 22, 2024

‘క్యాడర్ల’ను కాపాడుకునేందుకు ‘లీడర్ల’ పాట్లు…!

తప్పక చదవండి

ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 294 ఉండేవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా 2జూన్‌ 2014న ఏర్ప డిరది. దీనితో తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం లో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలను 2016లో జిల్లాల పునర్విభజన చేసి, ప్రస్తుతం 33జిల్లాలుగా విస్తరించడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను, నూతన మండలాలను, గ్రామాల పునర్విభజన చేయడం జరిగింది. రాష్ట్రంలో గతంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సంఖ్య పెంచుకోవడం జరిగింది. ఎన్నికల కమిషన్‌ వద్ద ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలతో పాటుగా ఈసారి జరిగే ఎన్నికలకు మరికొన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. 2018లో నూతన పంచాయతీ రాజ్‌ చట్టం చేయడం జరిగింది. దానితో పాటుగా రాష్ట్రంలోని గిరిజన తండాలను నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 12.769 గ్రామపంచాయతీలను గుర్తించడం జరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి ఎలక్షన్లో ఓటర్ల సంఖ్య, గ్రామాలలోని వార్డుల సంఖ్య కూడా పెరగడం జరిగింది. కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119నియోజకవర్గాలతో పాటుగా మరికొన్ని నియో జకవర్గాలు పెరుగుతాయని గత సంవత్సరం నుండి ప్రజలలో రాజకీయ పార్టీల నాయకుల మధ్య గుసగుసలు మొదలయ్యాయి. ఆశావాహులు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న పార్టీలలో టికెట్లు లభిం చని, ఊహించుకుంటున్న వారిలో రాష్ట్రంలో నియోజక వర్గాల సంఖ్య పెరుగుతాయని ఆశతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తు న్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 153 సీట్లకు పెరగవ చ్చునని రాజకీయ కురువృద్ధులు తమ అనుభవాలను తెలి యజేస్తు న్నారు. రాజకీయాలలో కుటుంబాల వారసత్వం రాజుల కాలం నుండి కుటుంబ రాజరికం తరహాలో ప్రస్తుత రాజకీయాలు కొన సాగుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలలో సీనియర్‌ నాయకులు గా, ఆయా రాజకీయ పార్టీలకు సేవలు అందించిన కార్యకర్తలు శాసనసభ్యులుగా జీవితంలో ఎన్నిక కావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలలో వివిధ హోదా లలో విద్యార్థి నాయకులుగా, యువజన సంఘాల నాయకులుగా, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళ అనుబంధ సంఘాలలో అనుభవం కలిగిన నాయకులు రాజకీయ పార్టీల అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పని చేసుకుంటూ, ప్రజలలో విశ్వాసం పొందుతున్నారు. రిజర్వేషన్‌,కుల బలం, జనబలం, బంధుత్వం వంటి అంశాలతో అంచనా వేసుకుంటు న్నారు. ఒకవేళ ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఆయా నియోజకవర్గాలలో రిజర్వేషన్‌ ఏ సామాజిక వర్గా నికి వస్తుందో అని కూడా అంచన వేసుకుంటున్నారు. కొత్త నియో జకవర్గాలు, పాత నియోజకవర్గాలు, రిజర్వేషన్‌ విధానం ఏవిధంగా ఉంటుం దో రాజకీయ అనుభవజ్ఞులు అంచనా వేసుకుంటు న్నారు. 2023 చివరి నాటికి రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుండే రాష్ట్రంలో రాజకీయ వాతా వరణం రాజు కుంటుంది. మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్ని కలు ముగి శాయి. తెలం గాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన చర్చలు మొదలు అవు తున్నాయి. రాజకీయ పార్టీలను మారే చోటామోటా నాయకులు భవిష్యత్తు ఎన్నికలు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ‘గోడమీది పిల్లి’ వలె అటఇట అని తన అనుచరులతో, సన్నిహి తులతో చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పెంపు ఆధారపడి ఉంది. అది ఇప్పుడు మరి ఎప్పుడో వేచి చూడాలి. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఓటు హక్కు ద్వారా ప్రతి 5సంవత్సరాలకు ఒకసారి కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ పంచాయితీ నుండి పార్లమెంటు స్థాయి వరకు ఎన్ని కలు జరుగుతాయి. ప్రతి రాజకీయ పార్టీలో లీడర్లు తమ క్యాడర్లు పెంచుకో వడానికి గ్రామస్థాయి నుండి దేశస్థాయి వరకు లీడర్లు క్యాడర్లను కంటికి రెప్పలాగా ప్రతిక్షణం కాపాడు కోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్నికలు ఇప్పుడే అన్నట్లుగా ఎన్నికల వేడి, వాతావరణం ఊపందుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయ పార్టీ అధ్యక్షులు వారివారి పార్టీలలో అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రకాలైన సర్వేలు నిర్వహించడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల కోసం పార్టీ తరఫున అభ్యర్థి నిలబెట్టడం కోసం ప్రజల అభిప్రా యం కార్యకర్తల సూచనలు, సలహాలు, అభ్యర్థి సెలక్షన్‌ కోసం పార్టీ ముఖ్య నాయకులు అధిష్టానం ఆశీర్వాదం కోసం పేర్లు పంప డం జరుగుతుంది. ఎన్నికలు అనగానే మొదటగా పార్టీ పరంగా అభ్యర్థుల సెలక్షన్‌ కావలసి ఉంటుంది. అసమ్మతి లేకుండా అందరిని కలుపుకోబోయే అభ్యర్థిని సెలక్షన్‌ చేయాల్సి ఉంటుంది. వివిధ రాజకీయ పార్టీలు సెలక్షన్‌ చేసిన అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో వివిధ పార్టీల నుండి నాయకులు ప్రజల యొక్క ఓటు ద్వారా గెలవడం కోసం ఎలక్షన్లలో పాల్గొనడం జరుగుతుంది. రాజకీయ పార్టీలు కేవలం అభ్యర్థిని సెలక్షన్‌ చేసి మాత్రమే ఎలక్షన్‌ కోసం బీఫామ్‌ ఇచ్చి పంపుతుంది.ఎలక్షన్లలో ప్రజల అభిమానంతో గెలవవలసి ఉంటుంది. ప్రతి 5 సంవత్స రాలకు ఒకసారి జరిగే ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికలలో గెలవవలసి ఉంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు