Sunday, June 23, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు బంగారం పట్టివేత

తప్పక చదవండి

హైద‌రాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు శుక్ర‌వారం ఉద‌యం త‌నిఖీలు నిర్వ‌హించారు. దుబాయ్ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి వద్ద 461 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 28.01 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లించిన ప్ర‌యాణికుడిని క‌స్ట‌మ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అత‌న్ని శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు