Sunday, May 19, 2024

అసిస్టెంట్‌ బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి ఇండియా పోస్టు ప్రకటన విడుదల

తప్పక చదవండి

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న.. గ్రామీణ డాక్‌ సేవక్స్‌-బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం)/అసిస్టెంట్‌ బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి ఇండియా పోస్టు ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 30,041 పోస్టుల‌ను భర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి పదోతరగతి ఉత్తీర్ణత. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాషలో తప్పనిసరిగా పదోతరగతిలో చదివి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌, సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభంకాగా.. ఆగ‌ష్టు 23 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు.
మొత్తం ఖాళీలు: 30,041. వీటిలో తెలంగాణ- 948, ఏపీలో -1045
పోస్టులు: గ్రామీణ డాక్‌ సేవక్స్‌-బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం)/అసిస్టెంట్‌ బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (ఏబీపీఎం)
పేస్కేల్‌: బీపీఎం పోస్టుకు రూ.12,000- 29,380/-, ఏబీపీఎం పోస్టుకు రూ.10,000-24,470/-
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాషలో తప్పనిసరిగా పదోతరగతిలో చదివి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌, సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.
వయస్సు: 2023, ఆగ‌ష్టు నాటికి 18- 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక : పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా
ద‌ర‌ఖాస్తు ఫీజు : రూ.100
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆగ‌ష్టు 23
వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు