Sunday, May 19, 2024

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఎస్‌ఐ రాజేందర్‌..

తప్పక చదవండి

నార్కోటిక్స్‌ విభాగంలో పని చేస్తూ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఎస్‌ఐ రాజేందర్‌ను కూకట్‌పల్లి కోర్టు పోలీస్‌ కస్టడీకి అనుమతి ఇచ్చింది. రెండురోజుల పాటు రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులు విచారించనున్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఎస్‌ఐ రాజేందర్‌ను ఇప్పటికే సస్పెండ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ ఆపరేషన్‌లో భాగంగా రాజేందర్ మహారాష్ట్రకు వెళ్లి అక్కడ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగా.. నైజీరియన్ వద్ద ఉన్న 1,750 గ్రాముల మాదకద్రవ్యాలను రాజేందర్‌ తన వెంట తీసుకువచ్చాడు. కొన్నింటిని తనవద్దే ఉంచుకొని.. డ్రగ్ కోర్టులో డిపాజిట్ చేసే సమయంలో తక్కువగా చూపించాడు.
ఆ తర్వాత ఇంట్లోని తన వద్ద ఉన్న డ్రగ్స్‌ను విక్రయించేందుకు ప్రయత్నించగా.. రాష్ట్ర నార్కోటిక్‌ విభాగం పోలీసులకు సమాచారం అందగా.. ఆయన ఇంట్లో సోదాలు చేశారు. రాయదుర్గం పరిధిలో ఉంటున్న రాజేందర్‌ ఇంట్లో తనిఖీలు చేసి రూ.80లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కస్టడీ కోసం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ కస్టడీకి పిటిషన్‌ దాఖలు చేయగా.. అనుమతి ఇచ్చింది. అయితే, రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలున్నాయి. రాయదుర్గం స్టేషన్‌లో పని చేస్తుండగా ఏసీబీ అధికారులకు అడ్డంగా బుకయ్యాడు. ఆ తర్వాత అధికారులు సర్వీసు నుంచి తొలగించగా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. తాజాగా డ్రగ్స్‌ విక్రయించేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కడం గమనార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు