Saturday, July 27, 2024

వినాయక చవితి పండుగ సందర్బంగా ఘనంగా ఏర్పాట్లు..

తప్పక చదవండి
  • పండగకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సమకూరుస్తామని వెల్లడించిన మేయర్ విజయలక్ష్మి.
    వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా పోలీస్, హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ, మెట్రో, జలమండలి, హెల్త్, అగ్నిమాపక శాఖ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై సమన్వయ సమావేశం బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మేటర్ మాట్లాడుతూ..వినాయక చవితి పండుగ ఉత్సవాల సందర్భంగా నగరంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు సూచించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. హెచ్ఎండీఏ ద్వారా స్టాటిస్టిక్స్ మొబైల్ క్రేన్లు గత ఏడాది కంటే ఎక్కువ క్రేన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్లపై బారీకేడ్, శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్స్, మొబైల్ ట్రీ కటింగ్, ప్రూనింగ్, ఆరోగ్య శిబిరాలు, బోట్స్, స్విమ్మర్లు, నిరంతరంగా విద్యుత్తు సరఫరా, వీధి లైట్స్, పాట్ హాల్స్, రోడ్డు మరమ్మతులు, అగ్ని మాపక యంత్రాలు, తాగు నీటి సరఫరా తదితర ఏర్పాట్లు చేయనున్నట్లు మేయర్ తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు