Monday, May 20, 2024

జెండా ఎగరేయడానికి ప్రజలు గెలిపించాలి కదా..

తప్పక చదవండి
  • అహంకారానికి పరాకాష్ట మోడీ..
  • తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే..

న్యూ ఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోటపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ’వచ్చే ఏడాది ఎర్రకోట వద్ద కలుద్దాం’ అన్న మోదీ వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ.. ప్రధాని వ్యాఖ్యలు ఆయన అహంకారాన్ని చూపిస్తున్నాయని అన్నారు. వచ్చే ఏడాది ఎర్రకోటపై కాకుండా.. మోదీ తన ఇంటి వద్ద జెండా ఎగురవేస్తారని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం రోజు ప్రధాని మోదీ ఎర్రకోట పై జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. వచ్చే ఏడాది మళ్లీ ఆగస్టు 15న వస్తానని, ఎర్రకోటపై జెండా ఎగురవేస్తానంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ.. ’ఆయన వచ్చే ఏడాది జెండా ఎగురవేస్తారు. కానీ, అది ఆయన ఇంటిపైనే. జయాప జయాలు నిర్ణయించేది ప్రజలు. అది ఓటర్ల చేతుల్లో ఉంది. 2024లో మరోసారి జెండా ఎగురవేస్తానని 2023లోనే చెప్పడం మోదీ అహంకారాన్ని చూపిస్తోందని ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య దినోత్సవ వేడుకలకు హాజరుకాలేకపోవడానికి గల కారణాలను ఖర్గే వివరించారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అందువల్లనే ప్రధాని ప్రసంగానికి హాజరు కాలేకపోయానని తెలిపారు. ’మొదట నాకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయి. రెండోది, ప్రోటోకాల్‌ ప్రకారం ఉదయం 9.20 గంటలకు నా నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి వచ్చి జెండాను ఎగురవేశాను. దానికి తోడు భద్రత చాలా పటిష్టంగా ఉంది. భద్రతా దళాలు ప్రధానిని తప్ప ఎవరినీ ముందుకు వెళ్లనీయడం లేదు. దీంతో సమయానికి ఎర్రకోట వద్దకు రాలేనని అనుకున్నా. అందుకే భద్రతా కారణాలు, సమయభావం కారణంగా అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని భావించా’ అని ఖర్గే వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు