Monday, July 22, 2024

ముగ్గురే కీలకం..

తప్పక చదవండి
  • స్వాతంత్య్ర ఉద్యమ ఫలాల్లో వీరిదే ప్రధాన పాత్ర..
  • గాంధీ,అంబేడ్కర్‌, నెహ్రూల వల్లనే దేశానికి పేరు..
  • ఇందిరా, రాజీవ్‌ ల దూరదృష్టి దేశానికి ఆదర్శం..
  • గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరణలో రేవంత్‌ రెడ్డి..

హైదరాబాద్‌ : అహింసా మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులను కల్పించిన మహానుభావుడు అంబేద్కర్‌ అని అన్నారు. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశాన్ని సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత నెహ్రూ అన్నారు. ఈ ముగ్గురిని మనం స్మరించుకుని నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పుకొచ్చారు. 140 కోట్ల భారతీయులందరికీ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీభవన్‌లో స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య సమరయోధుల చిత్రపటాలకు టీపీసీసీ చీఫ్‌ నివాళులు అర్పించారు. అనంతరం గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ… దేశ ప్రజలకు స్వాతంత్య ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్‌ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఈరోజు ప్రధానంగా ముగ్గురిని మనం స్మరించుకోవాలన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత ఇందిరా గాంధీ అని కొనియాడారు. దేశంలో ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చిన గొప్ప ప్రధాని రాజీవ్‌ గాంధీ అని తెలిపారు. అలాగే దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించింది పీవీ, మన్మోహన్‌ అని పేర్కొన్నారు. దేశంలో విభజించు, పాలించు విధానాన్ని ఈరోజు బ్రిటిష్‌ జనతా పార్టీ అవలంబిస్తోందని విమర్శించారు.

విద్వేషాన్ని వీడాలని భారత్‌ జోడోతో రాహుల్‌ గాంధీ స్ఫూర్తి నింపారన్నారు. నెహ్రూ నుంచి మన్మోహన్‌ వరకు చేసిన 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారని దుయ్యబట్టారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు.. కానీ పెరిగింది గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అని వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్న మైందన్నారు. మణిపూర్‌ మండుతుంటే మోదీ, అమిత్‌ షా కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి, కాంగ్రెస్‌ ఓడించేందుకు ఈడీ, సీబీఐని పంపించారన్నారు. నియంతలకంటే నికృష్టాంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్‌ హావిూలు ఇస్తుంటే, సీఎం కేసీఆర్‌ అదే పని చేస్తున్నారని అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతున్నదంటే అది కాంగ్రెస్‌ వల్లే అని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ఏది చేసినా ప్రజలు నమ్మరన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై తాము వచ్చాక సవిూక్షిస్తామని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిరదని.. 10వేల ఎకరాలు దోచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ వస్తుంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని హావిూ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తిరగబడదాం తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదామని పిలుపునిచ్చారు. ప్రతీ గడపకు వెళ్లి ప్రతీ తలుపు తడదామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దామంటూ నేతలకు, కార్యకర్తలకు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

కాగా ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పరోక్షంగా చురకలు అంటించారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్‌ కమిట్మెంట్‌ను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. మాట ఇచ్చిన వాళ్ళని ప్రశ్నించి విూ చిత్తశుద్ది నిరూపించుకోండని మందకృష్ణకి పరోక్షంగా చురకలు అంటించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కిషన్‌ రెడ్డి దేవుడు ఇచ్చిన అన్న కదా.. అయన్ని ఎందుకు అడగడం లేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. వర్గీకరణ విషయంలో తమ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన పని లేదన్నారు. మద్దతు ఒకరికి ఇచ్చి మరొకరిని ప్రశ్నిస్తే ఎలా? కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా వర్గీకరణపై స్పష్టంగా మా విధానాన్ని చెప్పారని రేవంత్‌ అన్నారు. వర్గీకరణకి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యక్తుల కోసం చేయబోమని.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం ఉందన్నారు. ధామాషా పద్ధతి ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తమకు తెలుసన్నారు. మా చిత్తశుద్ధి పై ఎవరికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి వకాల్తాలు తమకు అవసరం లేదని రేవంత్‌ అన్నారు. ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదన్నారు. బెదిరించే వారు ఎవరికి మద్దతు ఇచ్చారో వారినే అడిగితే మంచిదన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి కాంగ్రెస్‌ ఏంటో తెలుసన్నారు. కిషన్‌ రెడ్డి ఎందుకు పార్లమెంట్‌లో మాట్లాడం లేదని ప్రశ్నించారు. వాళ్ళ ప్రభుత్వంపై ఎందుకు ఓత్తిడి తేవడం లేదన్నారు. మాట ఇచ్చి అమలు చేయని వారిని నిలదీసి విూ చిత్తశుద్ధి నిరూపిస్తే కొంతైనా విూకు గౌరవం ఉంటుందని రేవంత్‌ హితవు పలికారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు