- దేశం ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు
- ఆశించిన లక్ష్యాలను, చేరాల్సిన గమ్యాలను చేరలేదు
- పదేళ్ల తెలంగాణ అద్భుత ఫలితాలను సాధించింది
- నాటి తెలంగాణకు.. నేటి తెలంగాణకు ఎంతో వ్యత్యాసం
- విద్యుత్, సాగునీటి రంగాల్లో అద్భుత ప్రగతి సాధన
- భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను ఆదుకున్నాం
- తెలంగాణ సాధిస్తున్న ప్రగతి… దేశం ఆచరిస్తోంది
- గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించి సందేశం ఇచ్చిన కెసిఆర్..
హైదరాబాద్ : 75 ఏళ్ల స్వాతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా.. ఆశించిన లక్ష్యాలను, చేరాల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో 77వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా సాగాయి. రాష్ట్ర ముఖ్మమంత్రి కేసీఆర్.. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు చేరుకున్న సీఎం కేసీఆర్… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, కళాకారులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు సీఎం కేసీఆర్.. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సైనిక వీరుల స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన స్వాతంత్ర సమర యోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. గతేడాది భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వజ్రోత్సవాల సమాపన ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరి హృదయంలో దేశాభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో గత నెలలో అనూహ్యంగా, అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అతివృష్టి పరిస్థితులను అంచనా వేస్తూ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని కేసీఆర్ పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి, ఆయా ప్రదేశాలకు సుశిక్షితులైన సిబ్బందినీ, పడవలనూ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను, భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లను వినియోగించింది అని కేసీఆర్ తెలిపారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయ శిబిరాలు ఏర్పాటుచేసి ఆదుకున్నది. తక్షణ సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ. 500 కోట్లు విడుదల చేసింది. ఊహించనిరీతిలో కుంభవృష్టి కురిసి, వరదలు సంభవించినా, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకొని ప్రాణ నష్టాన్ని, ఆస్తినష్టాన్నిచాలావరకు నివారించగలిగిందని సీఎం స్పష్టం చేశారు. అతివృష్టి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుందని కేసీఆర్ హావిూ ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్ళకు గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుంది. వరదలలో కోతకు గురైన పొలాల సంఖ్యను అంచనా వేయడం జరుగుతున్నది. జూన్, జూలై మాసాల్లో వర్షపాతంలో కలిగిన లోటును ఈ భారీ వర్షాలు భర్తీ చేశాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుకుండలుగా మారాయి. ఈసారి వరిసాగు రికార్డు స్థాయిలో 64 లక్షల 54 వేల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. పంటలు దెబ్బతిన్న రైతులు మళ్లీ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అన్నివేళలా బాసటగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలూ విధ్వంసమైపోయాయని కేసీఆర్ పేర్కొన్నారు. నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ముకాస్తూ చేవచచ్చి చేష్టలుడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజాఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని తెలిపారు.
తెలంగాణ పునర్నిర్మాణం ఒక పవిత్ర యజ్ఞం అంటూ.. పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దు:ఖం తన్నుకొస్తది అని కేసీఆర్ అన్నారు. ఎటుచూసినా పడావుపడ్డ పొలాలు, పూడుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దుబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకు పోయినా సుక్క నీరు కానరాని బోర్లు, ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరంటు షాక్‌కో, పాము కాటుకో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడుగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకువిూద ఆశ చచ్చి ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు, యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన ప్లలెలు, ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, మొరం తేలిన వాకిళ్లు, ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులు ఉండే అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించిందని సీఎం తెలిపారు. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమధనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించిందని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఎరిగిన ప్రభుత్వం కనుక, దానికి అనుగుణంగా అన్నిరంగాలనూ ప్రక్షాళన చేసిందని కేసీఆర్ తెలిపారు. అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించింది. అనేక రంగాలలో రాష్టాన్న్రి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో, అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. ‘తెలంగాణ ఆచరిస్తుంది ? దేశం అనుసరిస్తుంది‘ అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచింది అని కేసీఆర్ పేర్కొన్నారు. నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్ ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది అని కేసీఆర్ తెలిపారు. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతు న్నయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. తరలివస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారjైు తెలంగాణ భూములను తడుపుతున్నది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇపుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. దశాబ్దకాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నది. ఈ అద్భుతమైన పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా తెలంగాణ ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని ఇదే రీతిన అందించాలని హృదయ పూర్వకంగా మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం గానీ, ఒక రాష్ట్రం గానీ సాధించిన ప్రగతికి ప్రమాణంగా చూసే ప్రబల సూచికలు.. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం అని కేసీఆర్ చెప్పారు. ఈ రెండిరటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసింది. సంపద పెంచింది. ప్రజలకు పంచింది. దేశంలో స్థిరపడిన పెద్ద రాష్టాల్రను అధిగమించి నూతన రాష్ట్రం తెలంగాణ రూ. 3 లక్షల 12 వేల 398 తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు అయిన 1,255 యూనిట్లను అధిగమించింది. దేశ సగటు కంటే 70 శాతం అత్యధికంగా 2,126 యూనిట్ల సగటు వినియోగంతో తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది అని కేసీఆర్ తెలిపారు. విద్యుత్తు రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ అని కేసీఆర్ పేర్కొన్నారు. అనతికాలంలోనే అన్నిరంగాలకూ 24 గంటలపాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. విద్యుత్తు రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి అన్నిరంగాలనూ ప్రభావితం చేసింది. రాష్ట్రం ప్రగతిపథంలో పయనించేందుకు నిరంతర విద్యుత్తు చోదకశక్తిగా పనిచేసింది అని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు త్వరలోనే ఉత్తమ పీఆర్సీ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ªూష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో కూడా తెలంగాణ మిగతా రాష్టాల్రకన్నా ఎంతో ముందున్నది అని సీఎం స్పష్టం చేశారు. నేడు దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంటు ఇచ్చుకున్నం. ఇప్పటివరకూ రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్‌మెంట్ అందించుకున్నాం. కరోనా విజృంభణ ఆర్థిక వ్యవస్థ విూద తీవ్ర ప్రభావం చూపించిన తరుణంలోనూ ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌నే అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతోపాటుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం వేతనాల పెంపుదలను వర్తింపచేసింది. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తామని ఇటీవలి శాసనసభా సమావేశాల్లో నేను స్వయంగా ప్రకటించాను అని కేసీఆర్ గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కానీ, వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందిందని సీఎం తెలిపారు. తద్వారా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండిందన్నారు.. రాష్ట్రంలోని గూడు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క రూపాయికి కూడా పేదలకు ఖర్చు లేకుండా పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోంది. 77వ స్వాతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని నిరుపేదలకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. నేటి నుంచే హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తున్నదని కేసీఆర్ గోల్కొండ కోట వేదికగా ప్రకటించారు.