Wednesday, September 11, 2024
spot_img

ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త …

తప్పక చదవండి

ఐఫోన్‌ ప్రియులకు యాపిల్‌ సంస్థ శుభవార్తను అందించింది. తన సరికొత్త మాడల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లను క్యూపరిటినో వేదికగా విడుదల చేసింది. 2023 సంవత్సరానికిగాను యాపిల్‌ పార్క్‌లో కిక్కిరిసిన అభిమానుల మధ్య కంపెనీ సీఈవో టీమ్‌ కుక్‌ ప్రవేశపెట్టారు. అందరూ ఊహించినట్లుగానే ఐఫోన్‌ 14 మాదిరిగా నాలుగు రకాల ఐఫోన్లను ప్రకటించింది సంస్థ. ఐఫోన్‌ 15, 15 మ్యాక్స్‌, 15 ప్రో, 15ప్రో మ్యాక్స్‌లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈసారి ప్రత్యేకంగా యూఎస్‌బీ-సీ చార్జింగ్‌, కనెక్టింగ్‌ పోర్ట్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది.
యూరోపియన్‌ యూనియన్‌ చాలా కఠినంగా అమలు చేస్తున్న అన్ని ఫోన్లు-ఒకే చార్జర్‌ కాన్సెప్ట్‌ను యాపిల్‌ తప్పనిసరిగా ప్రవేశపెట్టాల్సి వచ్చింది. దీంతో ఏళ్ల తరబడి ఐఫోన్‌కే ప్రత్యేకమైన లైటెనింగ్‌ పోర్ట్‌ కాలగర్భంలో కలిసిపోనున్నది. ఇక అన్ని యాపిల్‌ ఉత్పత్తులను యుఎస్‌బీ-సీ కేబుల్‌తో కనెక్ట్‌ అయ్యేలా మార్చింది. మరో అదనపు ప్రత్యేకతగా తేలికగా, మన్నికతో ఉండే టైటానియం చాసిస్‌ రంగప్రవేశం చేసింది. అలాగే ఐఫోన్‌ పుట్టినప్పటినుండీ ఉన్న మ్యూట్‌ బటన్‌ ఈసారి మాయమై, దాని స్థానంలో యాక్షన్‌ బటన్‌ ప్రవేశపెట్టబడింది. ఈ బటన్‌ ద్వారా ఫోన్లో మనం చేయాల్సిన పనులను మార్చుకునే వీలుంది.
14ప్రో, మ్యాక్స్‌లలో ఉన్న 6.1, 6.7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఈ ఫోన్లలో కూడా మారలేదు. 15ప్రో రకాలకు ఏ17 బయోనిక్‌ చిప్‌ వాడుతున్నట్లు, తక్కువ రకాలైన 15, 15 మ్యాక్స్‌లలో ఏ16 ప్రాసెసర్‌నే కొనసాగిస్తున్నట్లు యాపిల్‌ తెలిపింది. ఇక కెమెరాల విషయానికొస్తే, 14తో పోలిస్తే వీటిని కూడా అప్‌గ్రేడ్‌ చేసారు. వివిధ మాడళ్ల ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి.ఐఫోన్‌ 15: సైజు – 147.6 X 71.6 X 7.8ఎంఎం. తెర : 6.1 అంగుళాలు, బరువు : 171 గ్రా., చాసిస్‌ : అల్యూమినియం, మెయిన్‌ కెమెరా : 48 ఎంపి, అల్ట్రా వైడ : 12ఎంపి, బ్యాటరీ : 3877
ఎంఎహెచ్‌, ఓఎస్‌ : ఐఓఎస్‌ 17, ధర: రూ. 79,900
ఐఫోన్‌ 15 ప్లస్‌: సైజు – 147.6 X 71.6 X 7.8ఎంఎం., తెర : 6.7 అంగుళాలు, బరువు : 171 గ్రా., చాసిస్‌ : అల్యూమినియం, మెయిన్‌ కెమెరా : 48 ఎంపి, అల్ట్రా వైడ : 12ఎంపి, బ్యాటరీ : 4912 ఎంఎహెచ్‌, ఓఎస్‌ : ఐఓఎస్‌ 17, ధర : రూ.89,900
ఐఫోన్‌ 15ప్రొ: సైజు-146.6 X 70.6 X 8.25ఎంఎం. తెర : 6.1 అంగుళాలు, బరువు : 188 గ్రా. చాసిస్‌ : టైటానియం, మెయిన్‌ కెమెరా : 48 ఎంపి, టెలీఫోటో: 12.7ఎంపి, అల్ట్రావైడ : 13.4 ఎంపి, బ్యాటరీ : 3650 ఎంఎహెచ్‌, ఓఎస్‌ : ఐఓఎస్‌ 17, ధర: రూ.1,34,900
ఐఫోన్‌ 15 ప్రొ మ్యాక్స్‌ : సైజు – 159.9 X 76.7 X 8.25ఎంఎం. తెర : 6.7 అంగుళాలు బరువు : 221గ్రా. చాసిస్‌ : టైటానియం మెయిన్‌ కెమెరా : 48 ఎంపి, టెలీఫోటో: 12.7ఎంపి-85ఎంఎం పెరిస్కోప్‌, అల్ట్రా వైడ : 13.4 ఎంపి బ్యాటరీ : 4852 ఎంఎహెచ్‌ ఓఎస్‌ : ఐఓఎస్‌ 17 ధర : 1,59,900ల నుంచి.ఈ అన్ని ఐఫోన్లు సెప్టెంబర్‌ 22 నుండి మార్కెట్లో ప్రవేశించనున్నాయి.
యాపిల్‌వాచ్‌ 9 ను కూడా ఈ వండర్‌ లస్ట్‌లో ప్రవేశపెట్టారు. ఎస్‌9 చిప్‌తో పాటు, 18 గంటల బ్యాటరీ లైఫ్‌ దీని ప్రత్యేకతలు. వాచ్‌ఓఎస్‌10తో రానుంది. ధర – 399 డాలర్లు
యాపిల్‌ వాచ్‌ అల్ట్రా2: సాహసయాత్రికుల కోసం గతేడాది వచ్చిన అల్ట్రాకు కొనసాగింపిది. సిగ్నల్‌ లేకపోయినా సాటిలైట్‌ సహాయంతో పనిచేస్తుంది. కఠినమైన వాతావరణాలలోనూ, ఎక్కువ నీటి లోతుల్లోనూ ఇది నిరంతరాయంగా పనిచేస్తుంది. ధర – 799 డాలర్లు ఈ రెండు వాచ్‌లు ఈనెల 22 నుంచి మార్కెట్లో లభించనున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు