Saturday, July 27, 2024

బెల్టు షాపులపై షాద్‌ నగర్‌ ఎక్సైజ్‌ పోలీసుల ఉక్కు పాదం..

తప్పక చదవండి
  • 2 లక్షల 87 వేల విలువ చేసే మద్యం స్వాధీనం..
  • 28 కేసులు నమోదు
  • వివరాలు వెల్లడించిన ఎక్సైజ్‌ సీఐ అంజన్‌ కుమార్‌..

షాద్‌ నగర్‌ క్రైమ్‌ : బెల్టు షాపులు నిర్వహిస్తే కటిన చర్యలు తీసుకుంటామని షాద్‌ నగర్‌ ఎక్సైజ్‌ సీఐ అంజన్‌ కుమార్‌ తెలిపారు..ఎన్నికల దృష్ట్యా ఎక్సైజ్‌, ప్రోబిషన్‌ డిప్యూటీ కమిషనర్‌,డిస్ట్రిక్ట్‌ ఎక్సైజ్‌, ప్రోబిషన్‌ అధికారుల ఆదేశాల ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఈ నెల 9 వ తేది నుండి అక్రమ మద్యం షాపులు,అక్రమ కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించి ఇప్పటి వరకు 28 కేసులు చేసి 160 లీటర్ల లిక్కర్‌,165 లీటర్ల భీర్లు,925 లీటర్ల కల్లు ను స్వాధీనం చేసుకున్నామని,విటి విలువ 2 లక్షల 87 వెలు వుంటుందని తెలిపారు అదే విధంగా రోజు వారీగా మద్యం షాపులు,బార్‌ షాపులు తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతిరోజు మా టీం గ్రామాలలో నిఘా పెట్టడం జరిగిందని ఎవరైనా అక్రమ మద్యం నిలువ చేసిన,అమ్మిన వారిపై చట్ట రీత్యా కటిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్‌ సీఐ అంజన్‌ కుమార్‌ తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు