Friday, September 13, 2024
spot_img

అంగన్వాడి ఆల్ ఇండియ బ్లాక్ డే సందర్భంగా భారీ ర్యాలీ, కలెక్టరేట్ ధర్నా..

తప్పక చదవండి
  • జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ కు వినతిపత్రం
  • అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
  • ఐసీడిఎస్ కు బడ్జెట్ పెంచి – అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలి.
  • సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్

హైదరాబాద్ : దేశ వ్యాప్త బ్లాక్ డే పిలుపులో భాగంగా అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తా నుంచి నస్పూర్ నూతన కలెక్టరేట్ కార్యాలయం వరకు నల్ల చీరాలతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దిశగా బడ్జెట్ను తక్కువ కేటాయిస్తూ, మరోపక్క ఐసిడిఎస్ స్కీమును ప్రైవేటికరణ చేసే దిశగా దేశంలో జాతియ నూతన విద్యా విధానం తీసుకొచ్చి పూర్తిగా ఐసిడిఎస్ వ్యవస్థను , ప్రభుత్వం తన బాధ్యతనుండి పక్కన పెట్టే దిశగా ఆలోచన చేస్తుంది. ఈరోజు అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి అంటే గ్రామాల్లో , మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు పోష్టికాహారం అందించే దిశగా అంగన్వాడి ఐసిడిఎస్ వ్యవస్థ పని చేస్తుంది. ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి నిరంతరం కష్టపడుతూ , శ్రమిస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నశించాలి. వెంటనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రిటర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు ఐదు లక్షలు, ఆయాలకు మూడు లక్షలు ఇవ్వాలి. జీవితంలో సగం పెన్షన్ ఇవ్వాలి. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి.నేడు దేశంలో పెరుగుతున్న ధరలు అనుగుణంగా అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం లేదు , ఉద్యోగ భద్రత లేదు , అంగన్వాడీ ఉద్యోగులు అంటే మనుషులు కాదా .. మాకు కుటుంబాలు ఉండవా.. ఈ ప్రభుత్వాలకు మా బాధలు కనిపించట్లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం…? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యగులుగా గుర్తించాలి. అంగన్వాడి ఉద్యోగుల పైన ఐసిడిఎస్ వ్యవస్థ పైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విదానాలు మార్చుకోకపోతే అంగన్వాడి ఉద్యోగుల పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఎనగందుల భానుమతి అంగన్వాడీ టీచర్ &హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాలు ఈరోజు అంగన్వాడి ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలి. బిల్ఓ డ్యూటీలో నుంచి అంగన్వాడీల మినహాయించాలి.డబుల్ బెడ్ రూములు , గృహలక్ష్మి పథకం, ఇతర అన్ని సౌకర్యాలు వసతులు కల్పించాలి. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా కోశాధికారి సువర్ణ, మహేశ్వరీ, చంద్రకళ, అనురాధ, సత్యవతి, విజయలక్ష్మి, రాజేశ్వరి,జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు