Wednesday, April 24, 2024

సుమారు రూ. ఏడు కోట్ల విలువచేసే వెయ్యి గజాల స్కూల్‌ స్థలం కబ్జా

తప్పక చదవండి
  • నిమ్మకు నీరెత్తినట్టున్న వ్యవహరిస్తున్నమున్సిపల్‌, మండల అధికారులు
  • స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పనులు నిలిపివేత
  • ఆల్విన్‌కాలనీ ధరణినగర్‌ లో ఘటన, కబ్జా బాగోతంపై ఎన్నో అనుమానాలు
  • కబ్జాలను నిరోధించి కబ్జాదారులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌..

కూకట్‌పల్లి ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని ధరణి నగర్‌ సర్వేనెంబర్‌ 336 లో సుమారు వేయిగజాల స్థలాన్ని కొందరు కబ్జా దారులు ఆక్రమించారు ప్రస్తుతం ఈ స్థలం విలువ సుమారు రూ .ఏడు కోట్ల వరకు ఉం టుందని అంచనా ఈ స్థలంలో కబ్జాదా రులు భారీ నిర్మాణాన్ని చేపట్టారు. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు రావడంతో తాత్కా లికంగా పనులు నిలిపివేశారు ఈ స్థలాన్ని 2009లో షంషీ గూడలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అదనపు గదుల కోసం మండల అధికారులు కేటాయిం చారు అయితే వారు ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇది కబ్జాదారులకు వరంగా మారింది 100 గజాల్లో ఇల్లు కట్టాలంటే సవా లక్ష అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత భారీ నిర్మాణం జరుగుతుంటే ఇటు మున్సిపల్‌ అధికారులు కానీ అటు మం డల అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసు కోకపోవడం పలు అనుమానాలకు దారితీ స్తుంది. తమ స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉన్నా కూడా వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ స్థలానికి పక్కనే ఉన్న అపార్ట్మెంట్‌ సైతం కొంత స్థలం ప్రభుత్వ భూమి లోనే కట్టారు వారు కబ్జా చేయగా లేనిది మేమెందుకు చేయకూడదు అంటూ మరో ఇద్దరు వ్యక్తులు పక్కనే ఉన్న ఈ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ కోసం స్థలం అడిగితే లేదన్నట్టు తెలి సింది. కొందరు రాజకీయ నాయకులు స్థానిక అసోసియేషన్‌ ప్రతినిధులు ఈ కబ్జాకు సహ కరిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు వారి ప్రమే యంతోనే ఈ కబ్జా బాగోతం జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నిర్మా ణాలపై మండల అధికారులకు ఫిర్యాదు రావ డంతో నిర్మా ణాలను తాత్కాలికంగా నిలిపి వేశారు అయితే అక్కడ నిర్మాణ సామాగ్రిని గాని నిర్మాణాన్ని గాని అధికారులు ఏమాత్రం తొలగించలేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చిన తర హాలో కేవలం నిర్మాణాలను నిలిపేయటం మా త్రమే జరిగింది ప్రస్తుత అధికారులు మారితే మళ్ళీ పనులు కొనసాగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించి నిర్మాణ సామాగ్రిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు కొత్త ప్రభుత్వంలో నైనా ఇలాంటి కబ్జాలను నిరోధించి కబ్జాదారులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు