Saturday, July 27, 2024

ఎంపీలకు ప్రోటోకాల్‌ లోపాలు..

తప్పక చదవండి
  • ఇండిగో ఎయిర్‌ లైన్స్‌కు ప్రివలేజ్‌ నోటీసులు..
  • ఎంపీల ఆరోపణలతో స్పందించిన ప్రివిలేజ్ కమిటీ..

న్యూ ఢిల్లీ :
ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ ఎండీ రాహుల్‌ భాటియాకు లోక్‌ సభ ప్రివిలేజెస్‌ కమిటీ సమన్లు జారీ చేసింది. విమానాశ్రయాల్లో ప్రోటోకాల్‌ ప్రకారం సౌకర్యాలు, మర్యాదలు ఉండడం లేదని ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రివిలేజెస్‌ కమిటీ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి 2021లో కేంద్ర పౌర విమానయానశాఖ ఎంపీ ప్రోటోకాల్స్‌ విషయంలో విమానయాన సంస్థలకు లేఖ రాసింది. అయితే, ఎంపీలు కన్ఫర్మేషన్‌ సీట్లను డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, కన్ఫర్మేషన్‌ లేని పక్షంలో ఎంపీలకు తొలి సీటు ఇవ్వాలని పౌర విమానయానశాఖ ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎంపీలు విమానాశ్రయానికి చేరుకోగానే చెక్ ఇన్‌కు సహకరించాలని సిబ్బందిని కోరారు. ఎంపీలకు కార్‌ పార్కింగ్‌ ప్రత్యేక సదుపాయం కల్పించాలనే డిమాండ్‌ సైతం ఉన్నది. లాంచ్‌లో వేచి ఉన్న ఎంపీలకు ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా టీ, కాఫీ సైతం అందిస్తున్నది. ఎంపీలు ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణల మేరకు పార్లమెంట్‌ ప్రివిలేజెస్‌ కమిటీ ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ ఎండీకి సమన్లు జారీ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు