Sunday, May 19, 2024

ప్రధాన్ కన్వెన్షన్ హాలుపై వేటు పడేనా..?

తప్పక చదవండి
  • కన్వెన్షన్ హాలు యాజమాన్యం లక్షల్లో పన్ను ఎగవేత..
  • ఏటా రూ. 2 లక్షల 66 వేల 730 మాత్రమే చెల్లింపు..
  • శ్రీహిల్స్ లో అక్రమ నిర్మాణాలు ఆగేనా..?
  • పత్తా లేని విజిలెన్స్ అధికారులు..
  • అక్రమాలపై ఎనలేని పోరాటం చేస్తున్న “ఆదాబ్ హైదరాబాద్ ” దినపత్రిక..

నార్సింగి, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
చేసేది అక్రమ నిర్మాణం.. అయినప్పటికీ పుర పాలక శాఖ మంత్రి రామన్న మా పాట్నరే అంటూ ప్రధాన్ కన్వెన్షన్ నిర్వాహకులు పేర్కొనడం గమనార్హం.. దీంతో ప్రధాన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణంపై వేటు పడుద్దా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మునే రాకమా..? లేక మంత్రికి వాటా ఉందా..? మంత్రి కేటీఆర్ చెప్పాలి.. మున్సిపల్ అధికారుల ధనదాహంతో ముందు,వెనుక చూడకుండానే 2019లో పరిగణలో ఉన్న గ్రామా పంచాయితీ రేట్ల ప్రకారం ఇంటిపన్ను నిర్ణయించి మున్సిపల్ ఖజానాకు గండి కొట్టారు.. 2019-20 సంవత్సరానికి గాను రూ. 2 లక్షల 66 వేల 730 మాత్రమే నేటి వరకు వసూళ్లు చేస్తున్నట్లు మున్సిపల్ రికార్డులను బట్టి తెలుస్తోంది..

కానీ ప్రస్తుతం మున్సిపాలిటీలో 2020-21 నుండి రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు వసూళ్లు చేయాల్సి ఉంటుంది.. అనుమతులు లేని నిర్మాణం కాబట్టి రెట్టింపు జరిమానా విధించి వసూళ్లు చేయాలి.. ఈ లెక్కన గడచినా రెండు సంవత్సరాల నుండి రూ. 70 లక్షల వరకు మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టారు.. ఇది ఇలా ఉంటే శ్రీ హిల్స్ లో 28 ఎకరాల్లో యథేచ్ఛగా సాగిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు లేవు.. వార్తా కథనాలు వస్తే తప్ప విజిలెన్స్ అధికారులు వాటి జోలికి పోరు.. కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించి యథేచ్ఛగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..

- Advertisement -

ఆదాబ్ కథనాలు చూసి స్పందించాం.. ఇంటి నెంబర్లు పది రోజుల క్రితమే రద్దు చేసాం.. ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించి…రెవెన్యూ అధికారులు భూమిని స్వాదీనం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సత్యబాబు సూచించారు.. అవసరమైతే జేసీబీలు, సిబ్బందిని పంపటానికి సిద్ధంగా ఉన్నామన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు