- ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు..
- తమ బిడ్డను ఆదుకోవాలంటున్న తల్లిదండ్రులు..
చౌటుప్పల్, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి.. రోజూ కష్టపడితేనే గాని పూట గడవని పరిస్థితి. ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతున్న క్రమంలో ఓ పేద కుటుంబంలో పెద్ద కష్టం వచ్చి పడింది. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని గల తంగడపల్లి గ్రామానికి చెందిన మంచాల లింగస్వామి – శ్రీలత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె భవ్యశ్రీ తంగడపల్లి హైస్కూల్ లో ఏడో తరగతి పూర్తి చేసింది. భవ్య శ్రీకి సంవత్సరము కింద ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా గుండెకు రంధ్రం పడిందని, గుండె నుండి వచ్చే రక్తం ఊపిరితిత్తులకు వెళ్తుందని వైద్యులు తెలిపారని తండ్రి లింగస్వామి తెలిపారు. ఈ నెల 19న, గుండెకు ఆపరేషన్ చేయాలని సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని, అన్ని డబ్బులు తమ వద్ద లేవని, దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయం అందించాలని కోరారు. ఎస్.బీ.ఐ. బ్యాంక్ అకౌంట్ నెంబర్ 62192155328, ఐ.ఎస్.ఎఫ్. కోడ్ నెంబర్ ఎస్.బి.ఐ.ఎన్. 00021183. ఫోన్ పే నెంబర్ 9948408254 కు సాయం అందించాలని ప్రార్థిస్తున్నారు..