Saturday, July 27, 2024

ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా భూ కబ్జాలు..

తప్పక చదవండి
  • దౌర్జన్యం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు..
  • తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్న బాధిత కుటుంబం..

నర్సంపేట, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కోర్టు కేసులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ.. ఆ భూమిలోకి ఇరువర్గాలు ప్రవేశించకూడదని బోర్డు పాతినప్పటికీ.. బీ.ఆర్.ఎస్. నాయకులు తెల్లవారు ఝామున మొరం పోసి భూమిలో మొరీలు వేసి భూ కబ్జాలు చేస్తూ.. తమని భయపెడుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు సంగినేని మేఘన, జ్ఞానేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. నర్సంపేట పట్టణానికి అనుకొని ఉన్న జాతీయ రహదారి 365 పక్కనే ఉన్న సర్వే నెంబర్స్ 122, 123/ఏ లో మా నాన్నగారైన సంగినేని జగదీశ్వర్ పేరిట మూడెకరాల వ్యవసాయ భూమి వుంది.. దానిపై మా చెల్లెలైన మామిడాల భార్గవి, ఆమె భర్త వెంకట రాజేష్ పలుమార్లు ఇతరులకు అమ్మమ్మని బీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కై.. పలుమార్లు హత్య ప్రయత్నం చేశారని, అంతేకాకుండా పోలీసులతో అక్రమ కేసులు బనాయింపజేసి మా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా మంగళవారం ఉదయం మూడెకరాల స్థలంలో మొరం పోసి రోడ్డు కోసం మోరీ వేస్తున్న సందర్భంలో మేము అక్కడికి వెళ్లి అడ్డగిస్తే.. మాపై మా బంధువులపై పోలీసుల పైన సైతం మా చెల్లెలు అయిన భార్గవి, ఆమె భర్త వెంకట రాజేషులు పెప్పర్ స్ప్రే తో దాడి చేశారని.. ఈ ఘటనలో మా బంధువులకు, పోలీసులకు సైతం గాయాలయ్యాయని బాధితులు తెలిపారు.. ఇప్పటికీ పలుమార్లు నర్సంపేట పోలీస్ స్టేషన్ లో భార్యాభర్తలు ఇరువురిపై, అదేవిధంగా వీరికి సహకరిస్తున్న బీ.ఆర్.ఎస్. నాయకులు బానోతు దశ్రు, శీలం రాంబాబు, మాలోతు శంకర్ నాయక్, రవీందర్ లు తమపై కక్ష కట్టి హత్య ప్రయత్నం చేసే ప్రమాదం ఉందని.. ఫిర్యాదు చేశామని.. ఈ విషయంపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు చొరవ చూపి తమకు వారి నుండి ఉన్న ప్రాణహాని నుంచి రక్షించాలని.. అదేవిధంగా తమకు న్యాయంగా రావలసిన వాటాల ప్రకారం తమ భూమిని తమకు అప్పగించాలని ఉన్నతాధికారులను బాధితులు వేడుకుంటున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు