న్యూఢిల్లీ : విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. గాల్లోనే అత్యవసర ద్వారం తెరిచి కిందకు దూకాలనుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు.. సదరు వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన గౌహతి నుంచి అగర్తలా వెళ్తున్న ఇండిగో విమానంలో గురువారం చోటు చేసుకుంది. బిశ్వజిత్ దేబథ్ అనే 41 ఏళ్ల వ్యక్తి గురువారం గౌహతిఅగర్తలా ఇండిగో 6ఈ
457 విమానంలో ప్రయాణించాడు. విమానం ఎక్కినప్పటి నుంచి అతని ప్రవర్తనతో ఇతర ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించాడు. విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులపై దాడికి యత్నించాడు. ఇక విమానం అగర్తలాలో ల్యాండ్ అవడానికి సరిగ్గా పది నిముషాల ముందు వీరంగం సృష్టించాడు. తన సీట్లో నుంచి ఒక్కసారిగా పైకి లేచి.. విమానం ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికులందరూ భయాందోళనకు గు రయ్యారు. ఇంతలో విమాన సిబ్బంది అతన్ని ఎలాగోలా అడ్డుకున్నారు. సదరు వ్యక్తి చర్యకు ఆగ్రహించిన ప్రయాణికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ విూడియాలో వైరల్‌గా మారాయి. ఇక విమానం అగర్తలా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాం డ్ కాగానే ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. అయితే, సదరు ప్రయాణికుడు డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని పోలీసులు వెల్లడిరచారు. ఎమర్జెన్సీ డోర్‌ను గాల్లో తెరిచి కిందకు దూకేయాలనుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడిరచారు.
తప్పక చదవండి
-Advertisement-