Saturday, May 18, 2024

పాత మండలానికినోటిఫికేషన్‌, కొత్త మండలంలో పోస్టింగులు

తప్పక చదవండి
  • డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులో భారీగా అవకతవకలు.?
  • రూల్స్‌కి విరుద్దంగా పోస్టింగ్‌ ఇచ్చిన డీఈఓ అశోక్‌..
  • కొత్తగా ఏర్పడిన మండలంలో పోస్టింగ్‌ ఎలా ఇస్తారు.?
  • జిల్లా కలెక్టర్‌ సారూ.. మీరైనా జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని పట్టించుకోండి
    సూర్యాపేట ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల సమస్త సమాచారాన్ని కంప్యూటర్‌ ద్వారా వివరాలను నిక్షిప్తం చేసే ‘‘డాటా ఎంట్రీ ఆపరేటర్ల’’ పోస్టుల్లో సూర్యాపేట జిల్లాలో అవకతవకలు జరిగాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.2019 నోటిఫికేషన్‌ ప్రకారం పాత మండలానికొక డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టును కాంట్రాక్ట్‌ బేసిక్‌ పద్దతిలో రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసేవారు. ఐతే కొంతకాలంగా జిల్లాలో ఈ పోస్ట్‌ లు ఖాళీగా ఉన్నాయి.ఇందులో భాగంగా ఉమ్మడి నేరేడుచర్ల మండలానికి డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్ట్‌ ఖాళీగా ఉంది.దీంతో నొటిఫికేషన్‌ ద్వారా ఆ పోస్టును భర్తీ చేయాలని నోటిఫికేషన్‌ ఇచ్చారు.ఈ క్రమంలో మేళ్లచెరువు లో డిప్యుటేషన్‌ మీద పని చేస్తున్న మిర్యాలగూడెంకి చెందిన నాగేందర్‌ ఉమ్మడి మేళ్లచెరువులో పని చేస్తూ జూన్‌ 17 న నేరేడుచర్లకు మారారు.దాంతో మేళ్లచెరువు పోస్ట్‌ ఖాళీ అయింది. ప్రస్తుతం నేడిరజర్లలో పనిచేస్తున్న ఎం.ఐ. ఎస్‌ ప్రశాంత్‌ అక్కడే ఉన్నప్పటికీ నాగేందర్‌ ని కూడా నేరెడుచర్ల కి బదిలీ చేశారు.
  • కొత్తగా రూల్స్‌ అమలుచేస్తున్న డీఈఓ.
    కొత్తగా నియామకమైన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ అభ్యర్ధి, మేళ్లచెరువుకు రావాల్సి ఉంది.కానీ ఇక్కడే డిఈఓ చక్రం తిప్పాడనే (మామూళ్లు) ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొత్తగా ఎంపికైన అనంతగిరి మండలానికి చెందిన పోతర్ల మాధవి అభ్యర్ధిని మేళ్లచెరువుకు కాకుండా, తన సొంత మండలం అయిన అనంతగిరి కి కేటాయించారు.2019 నోటిఫికేషన్‌ ప్రకారం పాత మండలాల్లో ఎక్కడ అయితే కాలీలు ఉన్నాయో,అక్కడ ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకొని సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆ సమయం లో నేరేడు చర్ల మాత్రమే కలిగా ఉందని చూపించారు అధికారులు. నూతనంగా ఎన్నికైన డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోతర్ల మాధవి ని జులై 14 న అనంతగిరి (కొత్తగా ఏర్పడిన మండలం) లోని ఎమ్మర్సి కార్యాలయంలో రిపోర్ట్‌ చేసి,విధులు నిర్వహిస్తున్నారు.
  • నోటిఫికేషన్‌ పాత మండలాలకి, పోస్టింగ్‌ ఇచ్చింది కొత్త మండలంలో..
    అసలు కొత్త మండలాలకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను తీసుకోవాలని ఎక్కడా లేకున్నా,స్టేట్‌ రూల్స్‌ ని పక్కన పెట్టి,జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ కొత్తగా రూల్స్‌ నీ ఏర్పాటు చేసి,మాధవి ని అనంతగిరికి కేటాయించారు.నోటిఫికేషన్‌ లో లేని మండలానికి పోస్టింగ్‌ ఎలా ఇచ్చారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.ఈ వ్యవహారం వెనుక లక్షల రూపాయలు చేతులు మారినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కాగా ఇప్పుడు మేళ్లచెరువు మండలంలో పనిచేస్తున్న నాగేందర్‌ నేరేడుచర్లకు బదిలీ అవడంతో, మేళ్లచెరువు,చింతల పాలెం మండలాలకు ఎవరు లేకపోవడంతో ఇంచార్జి డాటా ఎంట్రీ ఆపరేటర్‌ గా నాగేందర్‌ కె బాధ్యతలు అప్పగించారు. కొత్తగా వచ్చిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ మాధవిని మేళ్లచెరువులో పోస్టింగ్‌ ఇవ్వాల్సింది.కానీ జిల్లా విద్యాశాఖ అధికారి అవినీతి లీలలకు సొంత మండలంలోని మాధవి పోస్టింగ్‌ తీసుకుంది. కొత్త మండలానికి డేటా ఎంట్రీ ఆపరేటర్‌ లను ఎలా నియమించారనేది ప్రశ్నార్థకంగా మారింది.ఈ విషయం పై జిల్లా విద్యాశాఖ అధికారి కుతడి అశోక్‌ ని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు