Friday, July 19, 2024

సమాజాన్ని జాగృతం చేసేవి పత్రికలు మాత్రమే

తప్పక చదవండి

ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల పాత్ర ఎనలేనిది.మూల స్తంభాలు పత్రికలే.ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళ ను కధిలిస్టూ వుంది.ఫొర్త్‌ ఎస్టేట్‌గా పత్రికా రంగాన్ని పిలుస్తారు.పత్రికలు లేని సమాజాన్ని ఊహించ లేము.జాతీ యొధ్యమ కాలం, స్వాతంత్య్ర పోరాటం కాలము,గ్రంధాలయ ఉద్యమం కాలంలో వీని పాత్ర వెలకట్ట లేనిది. దేశంలో నవంబర్‌ 16, 1966వ సంవత్సరంలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్థాపించారు. ప్రతిసంత్సరం ఈ రోజున నేషనల్‌ ప్రెస్‌ డే (జాతీయ పత్రికా దినోత్సవం) గా జరుపుకుం టారు. ఇంటర్నెట్‌ లో వార్తలు ఎప్పటికప్పుడు అందుతున్నాయి. ఇన్ని రకాలుగా వార్తలు అందుకునే అవకాశము ఏర్పడినా వార్తలను అందుకుంటున్నా నేటికీ ప్రజలు వార్తలకోసం చివరిగా నమ్మేది వార్తాపత్రికలను మాత్రమే . ఒక చేతితో వార్తా పత్రిక మరో చేతిలో టీ కప్పు … అది ఒక రకమైన సామాజిక హోదాకు చిహ్నము . ఇది ఒక భాషకు , ఒక ప్రాంతానికి పరిమితమైన విషయము కాదు . ప్రపంచవ్యాప్తం గా వార్తా పత్రికలకు ఏమాత్రము ఆదరణ తగ్గలేదని చెప్పవచ్చు.మన దేశ వార్తాపత్రిక వ్యవస్థకు పునాది 1780 సంవత్సరములో పడిరది . ఆనాటికి పాలన బ్రిటిష వారి చేతిలోకి వెళ్ళింది . కలకత్తా నగరము రాజధానిగా పాలన సాగిస్తున్న కాలము . అటువంటి సమయములో తొలి వార్తాపత్రిక గా ‘‘ హికీస్‌ బెంగాల్‌ గెజిట్‌ ‘‘ అనేది జనవరి 29.1780 న విడుదల అయింది . ఆ సంవత్సరములోనే కలకత్తా లో రైటర్స్‌ బిల్డింగ్‌ నిర్మాణము కూడా పుర్తయింది . బెంగాల్‌ గెజిట్‌ తొలి సంచిక విడుదల అయిన జనవరి 29 ని వార్తాపత్రికా దినోత్సవం గా జరుపుకుంటున్నారు . ఆ పత్రికను ప్రచురించినది ‘‘ జేమ్స్‌ అగస్టిన్‌ హిక్‌ ‘‘ అందుకే అతని పేరు … అది ప్రచురితమవుతున్న ప్రాంతమైన బెంగాల్‌ ను కలిపి ‘ హికీస్‌ బెంగాల్‌ గెజిట్‌ ‘ అన్నారు . ఆ పత్రికలోనే తొలి వ్యాపార ప్రకటన విడుదలైంది . వ్యాపార ప్రకటనల్కు నిలయమైన పత్రిక కాబటీ దీనిని ‘ ఒరిజినల్‌ కలకత్తా జనరల్‌ అడ్వటైజర్‌ ‘ అని కూడా పిలిచేవారు . అప్పటికి భారతదేశములో అక్షరాస్యత తక్కువ , ఇంగ్లిష్‌ తెలిసినవారూ తక్కువే అయినా వార్తా పత్రికకు తగినంత ఆదరణ లభించింది . ఈ ప్రజాదరణ గమనించిన కొందరు కొత్త వార్తాపత్రికల్ని ప్రచురించసాగారు . వీటిలో ఇండియన్‌ గెజిట్‌ , కలకత్త జర్నల్‌ , బెంగాల్‌ హరాకరు , జాన్‌ బుల్‌ ఇన్‌ ది ఈస్ట్‌ వంటివి ఉన్నాయి .భారతీయులు ప్రముఖం గా భారతీయ పత్రికా రంగం లోకి అడుగు పెట్టింది 1851 లో దాదాభాయ్‌ నౌరోజి ద్వారా ఆయన ప్రారంభించిన ఒక రాజకీయ పత్రిక వలన . స్వాతంత్ర భావాలు ను ప్రచారము చేయడం ధ్యేయము గా ఆ పత్రికలు పనిచేశాయి. ప్రత్రికలలో వస్తున్న ప్రమాదం బ్రిటిష్‌ పాలకులు గుర్తించారు .. తమ పాలనకు వ్యతిరేకం గా వచ్చే వార్తల్ని అడ్డుకునే లక్ష్యము తో 1878 లో సెన్సార్‌ చట్టాన్ని అమలులో పెట్టారు . అయినా నాయకులు ఏమాత్రము వెనుకంజవేయలేదు . ఎఫ్‌.సి.మెహతా 1882 లో కైసర్‌-ఎ-హింద్‌ పత్రికను ప్రారంభించారు. తాను చేపట్టిన సామాజిక సంస్కరణల ప్రచారానికి రాజా రామమోహన రాయ్‌ కూడా తన సొంత పత్రికను ప్రారంభించారు . పత్త్రికలకున్న పాత్రను స్వాతంత్య్రయ పోరాటం లో పాల్గొన్న ప్రతీ నాయకుడు గుర్తించాడు . దాదాపు తొలితరం నాయకులందరూ తమ తమ ప్రాంతీయ భాషలలో గాని , ఇంగ్లీషులో లో గాని పత్రికలు నిర్వహించారు . స్వాతంత్య్ర సమరములో పత్రికలు ప్షోరిచిన పాత్ర అమోఘము . విద్యావ్యాప్తిలో పత్రికల సంఖ్య పెరిగింది . స్వాతంత్య్రము సిద్ధించేనాటికి మనదేశములో 10 ముండి 12 ఆంగ్ల దినపత్రికలు ప్రముఖంగా ప్రచారములో ఉన్నాయి. వీటిలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా , స్టేట్స్‌ మన్‌, పయనీర్‌ పత్రికలు బ్రిటిష్‌ యజమానులు నడిపించేవారు . జాతీయ భావముతో చెన్నపట్నంలో ‘‘ ది హిందూ’’ , ముంబై లో ‘‘ ఇండియన్‌ ఎక్ష్ప్‌ ప్రెస్‌ ‘‘ ఢల్లి లో ‘‘ హిందుస్తాన్‌ టైమ్స్‌ , కలకత్తాలో ‘ అమృత బజార్‌ ‘ ఉత్తర భారతం లో ‘ నేషనల్‌ హెరాల్డ్‌ ‘ , మధ్య భారత లో ‘ హితవాద ‘ వెలువడుతుండేవి . మద్రాస్‌ నుండి ‘ మెయిల్‌ ‘ అనే మరో దినపత్రిక కూడా వచ్చేది. ఆంగ్ల భాషాపత్రికలతో పాటుగా ప్రాంతీయ భాషలలోనూ పత్రికా రంగం వ్యాప్తిచెందింది. అన్ని భాషలవారూ పత్రికల ప్రచురణలో పోటీపడి ప్రచురించేవారు. ప్రతి భాషలో కొన్ని పత్రికలు అత్యున్నత స్థాయికి చేరడం, ఆ తర్వాత కనుమరుగవడం జరిగింది .తెలుగునాట పాఠకులను విశేషంగా కదిలించిన పత్రికలు ‘ఆంధ్ర పత్రిక ‘ కృష్ణా పత్రిక,గోల్కొండలు వాటి ప్రాచుర్యము క్రమముగా కోల్పొయీ మూతబడ్డాయి. తెలుగు భాషకు సంబంధించినంతవరకు నిర్విఘ్నముగా వెలువడుతున్న వార్తాపత్రిక గా ‘ జమీన్‌ రైతుని పేర్కొనవచ్చును . ఎనిమిది శతాబ్దాలకు పైగా ప్రచురణ చరిత్ర దీనికున్నది . మిగిలిన దేశాలలో ఎలా ఉన్నా మనదేశములో వార్తాపత్రికలు తొలి నుండి ఒక స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తూనే వచ్చాయి. మన దేశములో వార్తాపత్రికలు ప్రారంభమైన తొలిరోజుల్లో ‘ గెజిట్‌ ‘ తన మోటోగా ఒక చక్కని వాక్యం పచురించింది. ‘‘మాది ఒక రాజకీయ, వ్యాపార పత్రిక … అన్ని రాజకీయ పార్టీలకు స్థానము కల్పిస్తాం కాని ఏ రాజకీయ పార్టీ ప్రభావానికి లోను కాము ‘‘ అన్న నాటి గెజిట్‌ లక్ష్యమే నేటికీ పత్రికలకు ఆదర్శముగా నిలుస్తుంది . ప్రాంతీయ భాషలలో కొన్ని పత్రికలు కొన్ని పార్టీల కొమ్ము కాసేవిగా ముద్రపడ్డాయి. అయితే అటువంటి రాజకీయ ముద్ర ఆయా పత్రికల ఎదుగుదలను ఏదో ఒక సమయంలో దెబ్బతీస్తుంది. రాజకీయ పార్టీలు తమ సిద్ధాంత ప్రచారానికి తమ కంటూ సొంత పత్రికలు ఉండాలని భావించాయి. కొన్ని సంస్థలు పత్రికల్ను నిర్వహిస్తున్నాయి .పత్రికలలో పెద్ద పీట రాజకీయ పత్రికలదే. ప్రాంతీయ భాషలలో పత్రికలకు అధిక ఆదరణ ఉండడం గమనించిన జాతీయ స్థాయి పత్రికలు ప్రాంతీయ ఎడిషన్లను ప్రారంభంచాయి. ఇండియా టుడే , సండే ఇండియన్‌ వంటి ఆంగ్ల పత్రికలు దక్షిణాది భాషలలో కూడా తమ ప్రచురణలు మొదలు పెట్టాయి . దేశ రాజధాని అయిన ఢల్లి నగరం నుంచి పలు ప్రాంతీయ భాషా వార్తాపత్రికల ప్రచురణ ప్రారంభమైంది . ఢల్లిలో మొత్తం 15 భాషలలో వార్తాపత్రి కలు వస్తున్నాయి.భారతదేశ జనాభాలో పత్రికలు చదివే పాఠకులు 20 శాతమే ఉన్నారు . అందులో కేవలం 10 శాతము మంది మాత్రమే పత్రికలను కొని చదువుతారు . మిగిలినవారు పత్రికలను పంచుకొని లేదా లైబ్రరీలలో చదువుతుంటారు . కొవిడ్‌ కారణం గా పత్రికా రంగం తీవ్రం గా ధెబ్బ తింధి.పాటకులు పత్రికలు ఇంటికి వేయించుకొవడం తగ్గింది.పేజీలు కూడా థగ్గినాయి.ఆన్‌ లైన్‌ లో పత్రికలు చదివే వారి సంక్య పెరిగింది. పెద్ద పత్రికల ధరలు కూడా సుమారు యేడు రూపాయలు వుంది. పత్రికలను కొని చదివే అలవాటు తెలుగువారిలో తక్కువగా ఉండడం భాధాకరమైన విషయమే. తమిళనాడు లో పత్రికలు కొని చదివే అలవాటు ఎక్కువ అవడం మూలాన పత్రికా రంగం బలము గా స్థిరముగా ఉంది.
` కామిడి సతీష్‌ రెడ్డీ 9848445134

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు