Tuesday, May 21, 2024

ఇంజనీరింగ్ విద్యార్థులకు అండగా నిలవాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి..
  • 8 క్రెడిట్ సబ్జెక్ట్ మినహాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి..

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. జె.ఎన్.టి.యూ.హెచ్. విద్యార్థులకు కావాల్సిన 8 క్రెడిట్ సబ్జెక్ట్ మినహాయింపులు ఇవ్వాలని కోరారు. గతంలో ఇచ్చిన 8 క్రెడిట్స్ సబ్జెక్ట్ మినహాయింపు సదుపాయం,అర్18 బ్యాచ్ కూడా వర్తింపజేయాలని కోరారు. ఏ.ఐ.సి.టి.ఈ. అకడమిక్ రూల్ ప్రకారం ఒక విద్యార్థి ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందడానికి 150-160 క్రెడిట్స్ కావాలి. కానీ జె.ఎన్.టి.యూ.హెచ్. డిగ్రీ పొందడానికి 160 క్రెడిట్లను తప్పని సరి చేయడం కరెక్ట్ కాదని అన్నారు. కేవలం ఒకటి లేదా రెండు సబ్జెక్టుల కారణంగా, విద్యార్థులు ఆఫర్ లెటర్లు పొందిన తర్వాత కూడా ఉద్యోగాల్లో చేరలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

కరోనా సమయంలో కూడా పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారని.. వారికి అడ్డుగా ఈ క్రెడిట్స్ ఉన్నాయని అన్నారు. ఈ క్రెడిట్స్ సమస్య కారణంగా ఎంతో మంది సతమతమవుతున్నారని.. వారి భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వం కాస్త కనికరించాలని అన్నారు. విద్యార్థులు కోరినట్లుగా క్రెడిట్స్ లో మార్పులు చేస్తే 14000 వేల బ్రతుకుకలకు అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్, అరవింద్, ధనుష్, గోపీచంద్, వందల సంఖ్యలో జేఎన్టీయూ విద్యార్థులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు