Wednesday, October 16, 2024
spot_img

నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సెన్సార్

తప్పక చదవండి
  • డిసెంబర్ 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది.

రీసెంట్‌గా విడులదైన డెవిల్ మూవీ ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ జోనర్‌లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియెన్స్‌కి ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. లేటెస్ట్‌గా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. డెవిల్ సినిమాపై పాజిటివ్ టాక్‌ రావటంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

కళ్యాణ్ రామ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించనున్నాయి. దీంతో పాటు డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఆడియెన్స్‌ని అలరించనున్నాయి.

తెలుగులో అద్భుతమైన చిత్రాలను రూపొందించిన అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై డెవిల్ మూవీ రానుంది. ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఆధ్వర్యంలో డెవిల్ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన లోకాన్ని క్రియేట్ చేశారు. దీనికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ తోడు కావటంతో విజువల్స్ నెక్ట్స్ రేంజ్‌లో మెప్పించనున్నాయి. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేసిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు