Tuesday, May 14, 2024

పరిగిలో విగ్రహాల ఆవిష్కరణ..

తప్పక చదవండి
  • కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్..
  • విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న జ్ఞానేశ్వర్, ఈటల, బిత్తిరి సత్తి..
  • బహుజనుల్లో స్పందన నేడు స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్న కాసాని వీరేశం..
  • పండుగల సాయన్న పుస్తకాల ఆవిష్కరణ..
  • భారీగా హాజరైన ముదిరాజ్ జన సందోహం..

బహుజన రాజాధికారమే లక్ష్యంగా ముదిరాజ్ లు కదం తొక్కారు.. వికారాబాద్ జిల్లా, పరిగిలో వెలగొంతుకలతో నినదించారు.. సబ్బండ వర్గాలతో కలిసి బహుజన రాజ్యం చేపట్టినప్పుడే పండుగల సాయన్న కు ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని నాయకులు సూచించారు.. పార్టీలకు అతీతంగా ఒకే వేదిక పంచుకోవడం శుభ పరిణామం అని చెప్పవచ్చు..

పరిగి : బహుజన రాజాధికారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి శారద గార్డెన్ లో వివిధ పార్టీలకు అతీతంగా ఏర్పాటుచేసిన ముదిరాజ్ మహాసభను ఉద్దేశించి మాట్లాడారు. పండుగల సాయన్న పేద ప్రజల కోసం తాను దొంగిలించిన సత్తును పేదలకు పంచిపెట్టి వారి ఆకలిదపికలను తీర్చారన్నారు. ఆ మహానీయుని మార్గదర్శనంలో మనమంతా మంచి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. బహుజనుల అభివృద్ధికి అసెంబ్లీలో గొంతు వినిపించాలంటే మన ఓటు విలువను తెలుసుకొని బహుజనులను ఆదరించాలని నొక్కి చెప్పారు. బిసి-డి నుంచి బీసీ ఏలోకి మార్చడానికి 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఫలితం కొలికి రానుందన్నారు. అగ్రవర్ణాల అణిచివేతను అడ్డుకునేందుకు ఓటే ఆయుధంగా సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు. పవనాలు బహుజనులకు అనుకూలంగా ఉన్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి మెలగాలన్నారు. మోసపూరిత వాగ్దానాలకు లోను కాకుండా జాగరుకతతో నడుచుకోవాలని స్పష్టం చేశారు.

- Advertisement -

విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న జ్ఞానేశ్వర్, ఈటల, బిత్తిరి సత్తి :
ఆదివారం ఉదయం పరిగి పట్టణంలోని హైదరాబాద్ – బీజాపూర్ ప్రధాన రహదారి పక్కన పండుగల సాయన్న కృష్ణ స్వామి విగ్రహాలను రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, కాసాని వీరేశం బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ తదితరులు కలిసి ఆవిష్కరించారు. వివిధ గ్రామాల నుంచి పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి జన సందోహం మధ్య పరిగి కోర్టు నుంచి శారద గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

టిడిపి పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశం మాట్లాడుతూ :
పదేండ్ల క్రితం బహుజనుల్లో కనిపించని స్పందన నేడు స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. యువత కసితో ఉండడంతో దీని కోటగా మలుచుకొని రాజ్యాధికారం చేతికిచ్చుకోవాలన్నారు. పెత్తందారుల చెప్పు చేతల్లో ఉంటే నష్టపోయేది అన్నారు. అందుకు వారికి తగిన గుణపాఠం చెప్పాలంటే మనమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరిగి నుండే మార్పులు తీసుకురావాలని అసెంబ్లీలో 45 శాతం ఉన్న జనాభాకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక సీటు కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. మనం ఒకటైతే మనమే సీట్లు ఇచ్చే స్థాయిలో ఉంటామని చెప్పారు.

పండుగల సాయన్న పుస్తకాల ఆవిష్కరణ :
పండుగల సాయన్న జీవిత చరిత్ర గురించి రాసిన పుస్తకాలను జాతీయ తెలుగుదేశం పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వృద్ధ కళాకారులు కిన్నెర పాటలను ఆలపించారు. చంద్రయానే వృద్ధ కళాకారుడు నోటితో కిన్నెర నాదని వినిపిస్తూ ఆలపించిన పాట అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సబికుల చప్పట్ల మధ్య జేజేలు పలికారు.ఈ కార్యక్రమంలో రామస్వామి, రామకృష్ణ, బాల ముకుందo, ముకుంద నాగేశ్వర్, హనుమంతు ముదిరాజ్,దోమ మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు జెడ్పిటిసిలు ఉప సర్పంచ్ లు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు