Tuesday, May 21, 2024

ఇండియా కూటమిలో మరిన్ని రాజకీయ పార్టీలు..

తప్పక చదవండి
  • జీకాజా వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్..
  • తదుపరి సమావేశం ముంబైలో ఉంటుంది..
  • ఈ సమావేశంలోనే సీట్ల పంపకాలు.. ఇతర అజెండాల వెల్లడి..

న్యూ ఢిల్లీ : 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. 26 విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిపై తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తదుపరి సమావేశం ముంబైలో ఉంటుందని, ఈ సందర్భంగా ఇండియా కూటమిలోకి మరిన్ని రాజకీయ పార్టీలు చేరుతాయని అన్నారు. కానీ.. ఏయే పార్టీలు చేరుతాయన్న విషయాన్ని మాత్రం నితీశ్ కుమార్ రివీల్ చేయలేదు. అయితే.. తదుపరి సమావేశాల్లో ఏయే అంశాలపై చర్చించనున్నారన్న విషయాలపై మాత్రం ఆయన హింట్స్ ఇచ్చారు.

మీడియాతో నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రణాళికలు ఏంటన్న విషయాలపై ముంబైలో జరగనున్న సమావేశంలో చర్చించనున్నాం. అలాగే.. సీట్ల పంపకంతో పాటు ఇతర అజెండాలు కూడా ఖరారు చేయబడతాయి. ఇదే సమయంలో కూటమిలోకి మరికొన్ని రాజకీయ పార్టీలు చేరుతాయి. 2024 లోక్‌సభ ఎన్నికలలోపు గరిష్య సంఖ్యలో విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆ దిశగానే నేను పని చేస్తున్నాను. అయితే.. నాకంటూ ప్రత్యేకమైన కోరికలేమీ లేవు’’ అంటూ చెప్పుకొచ్చారు. కానీ.. ఏ పార్టీలు చేరబోతున్నాయన్న ప్రశ్నకు మాత్రం నితీశ్ సమాధానం ఇవ్వలేదు.

- Advertisement -

ఇదిలావుండగా.. 2014 నుంచి అధికారంలో ఉన్న బీజేపీని 2024లో ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో 26 విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి.. నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు సమావేశమైంది. తొలుత పాట్నాలో జూన్ 23వ తేదీన సమావేశమైన ఈ కూటమి.. ఆ తర్వాత జులై 17, 18వ తేదీల్లో బెంగళూరులో సమావేశమైంది. ఇక మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో ముంబైలో నిర్వహించనుంది. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు