Sunday, July 21, 2024

సామాజిక మాధ్యమాలపై నిఘా, నియంత్రణ అవసరం

తప్పక చదవండి

పెద్దన్న మిమ్మల్ని గమనిస్తున్నాడు’ జార్జ్‌ ఆర్వెల్‌ విరచిత ‘1984’ నవలలోని చిరపరిచిత వ్యాఖ్య ఇది. నియంతృత్వ ప్రభుత్వాలు ప్రజలపై నిత్యం నిఘా వేస్తాయని హెచ్చరించడానికి ఆ బ్రిటిష్‌ రచయిత రాసిన వాక్యాలు నేటి డిజిటల్‌ యుగంలో అక్షర సత్యాలవుతున్నాయి. నిజం చెప్పాలంటే పెద్దన్న స్మార్ట్‌ఫోన్‌ అవతారమెత్తి మన జేబులోకి దూరి, ఎప్పటికప్పుడు మన మాటలు ఆలకిస్తున్నాడు. మన కదలికలను కనిపెడుతున్నాడు. ఇంతవరకు సైబర్‌ నేరస్తులు, ఉగ్రవాదులు, శత్రు దేశాల నుంచి ముప్పు ఎదురవుతుండగా, నేడు ప్రభుత్వాలు కూడా ఆ వరసలోకి చేరుతున్నాయి. ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలతో అమెరికా ఎన్నికల ప్రక్రియను గాడి తప్పించిందని ఇటీవల కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా సంస్థపై దుమారం రేగిన సంగతి తెలిసిందే.సామాజిక మాధ్యమాలతో పొంచి ఉన్న ప్రమాదంపై పోప్‌ ఫ్రాన్సిస్‌ హెచ్చరికలు చేశారు. వీటి కారణంగా మానవ సంబంధాలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో పక్షపాత, విభజన, విద్వేష ధోరణి పెరిగిపోయిందని, దీనిపై శాసనకర్తలు అప్రమత్తంగా ఉండి నిఘా పెట్టాలని ఆయన కోరారు. రోమ్‌కు చెందిన అంతర్జాతీయ కేథలిక్‌ లెజిస్లేటర్‌ల నెట్‌వర్క్‌ వార్షిక సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. దురదృష్టవశాత్తు కొందరు తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే వార్తలకు, విభజన, విద్వేష వ్యాప్తికి వినియోగిస్తున్నారన్నారు. ఈ విభజన ప్రచారం వల్ల యువతను వేరు చేయడమే కాక, వారిలో ఒంటరితనాన్ని పెంచుతున్నదని ఆయన అన్నారు. ప్రపంచం పై సామాజిక మాధ్యమాలు విష సంస్కృతిని వెదజల్లుతున్నాయి. మాధ్యమాల వినియోగం పరిమితులకు మించి వుండదం తో తప్పుడు వార్తలు, అసత్యాలు, మాధ్యమాలలో ప్రచారమై ప్రభుత్వాలకు , సమాజానికి కొత్త తలనొప్పులను తెచ్చి పెడుతున్నాయి.సాక్షాత్తు ప్రధాని సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలపై మన్‌ కి బాత్‌ కార్యక్రమం లో ఆందోళన వ్యక్తం చేసారంటే, వీటి ప్రభావం సమాజం పై ఎంత తీవ్రం గా వుందో ఊహించవచ్చు. సామాజిక మాధ్యమాలలో వార్తలు, తుపాకీ తూటాల కంటే వేగం గా ప్రచారమై సమాజం లో అలజడిని సృష్టిస్తున్నాయి.ప్రపంచం లో కొన్ని దేశాలు మాధ్యమాలను తమ ఆయుధం గా వుపయోగించుకొని పొరుగు దేశాలవారిని మానసికంగా బలహీనపరుస్తుండడం ఇప్పుడు కొత్తగా నెలకొన్న పరిణామం.మన దేశానికి అరబ్బు, చైనా మరియు రష్యాల నుండి సామాజిక మాధ్యమాల ద్వారా ముప్పు పొంచి వుందని నిఘా వర్గాలు ఇటీవలే హెచ్చరించాయి.వేర్పాటు వాదం, ఉగ్రవాదం ఊపిరిగా చేసుకున్న మన పొరుగు దేశం పాకిస్తాన్‌ ప్రత్యక్ష యుద్ధం తో మన దేశాన్ని దెబ్బ తీయలేక, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ కాశ్మీర్‌ లోయలో అలజడి సృష్టిస్తోంది.. కొన్ని ఉగ్రవాద సంస్థలు లోయలో సామాజిక మాధ్యమాలను వుపయోగించుకొని యువతను, తుపాకీ సంస్కృతి, ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నాయి.తాజాగా హిజ్‌ బుల్‌ , లష్కరే, జైష్‌ ఏ అహ్హమద్‌ సంస్థలు అరాచకం సృష్టించడానికి సామాజిక మాధ్యమాలపై యువతకు అవగాహనా శిక్షణా తరగతులు నిర్వహించి ఉగ్రవాదంం పెచ్చరిల్లేటట్టు చేస్తుండడం సామాజాన్ని కుదిపేస్తున్న బాధాకరమైన విషయం. కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేసూ, మన సైనికులకు ఇంఫార్‌ మర్లుగా వూవహరిస్తున్న పౌరులను బంధించి హింసిస్తునట్లు సామాజిక మాధ్యమాలలో లభ్యమౌతున్న చిత్రాలు కాశ్మీరు లోయలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.కొన్ని సర్వేల ప్రకారం వేలకు పైగా అరావ్హక శక్తులు మాధ్యమాలలో తమ నకిలీ ఖాతాల ద్వారా ఉగ్రవాదులకు , సైనికులకు కాల్పులు జరుగుతునట్లు పుకారు వార్తలను పెట్టగానే ఆ ప్రదేశాలకు అరాచక మూకలు చేరుకొని సైనికులకు వ్యతిరేకం గా రాళ్ళు రువ్వడం, హింసను ప్రేరేపించడం చేస్తున్నాయని వెల్లడిరచాయి.మన పొరుగు దేశం లో కొన్ని వేలకు పైగా అరాచక మూకలు వాట్స్‌ అప్‌ సమూహాలుగా ఏర్పడి నిరంతరాయం గా ఈ ఉగ్రవాద కార్యక్రమాలకు ఊతం ఇస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు మన ప్రభుత్వం ఇరవైకి పైగా సామాజిక మాధ్యమ సంస్థలను కాశ్మీర్‌ లోయలో నిషేదించిందంటే మాధ్యమాల దుష్ప్రభావం ఎంతగా వుందో అర్ధమౌతోంది. మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీప్స్తున్న వేళ రష్యా కూడా మన దేశంలో వారి ఆయుధాల మార్కెట్‌ ను పెంచడానికి ఈ విష సంస్కృతిని ఎరగా వేస్తునట్లు నిఘా వర్గాలు హెచ్చరించడం పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కావాలి.ఎంతో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం మార్ఫింగ్‌ ఫొటోల ద్వారా ఇంట్లో నే వుండి వోటు వెయవచ్చు అనే తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేసి , కొన్ని వేల మంది వోటు హక్కు కోల్పోయేటట్లు చేయగలిగిందంటే ఈ సామాజిక మాధ్యమాల తీవ్రత ప్రపంచాన్ని కుదిపేస్తోందనదం లో ఎలాంటి సందేహం లేదు. మన దేశ రక్షణ వ్యవస్థను చేదించడానికి శత్రు దేశాలు చైనా సాంకేతిక సహకారం తో మాల్‌ వేర్‌ నే సాఫ్ట్‌ వేర్ను మన రక్షణ అధికారుల కంప్యూటర్లు, మొబైళ్ళలోనికి పంపి వారి కదలికలపై నిఘా పెడుతున్నారు.కొన్ని ఉగ్రవాద సంస్థలైతే యువత పేర్లతో ఫేస్‌ బుక్‌, వాట్స్‌ అప్‌ ల ద్వారా భారత సైనికాధికారులతో స్నేహ సంబంధాలు పెంచుకొని మన రక్షణ వ్యవస్థను చిన్నా భిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఇటీవల దేశం లో సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషాలు, అసత్య ప్రచారం చేసి మూక హింస పెచ్చు పెరిగేటట్టు చెసిన ఒక సామాజిక మాధ్యమ సంస్థలు సుప్రీం కోర్టు తాఖీదులు ఇచ్చి భవిష్యత్తులో వార్తల ప్రసారం విషయం లో తగు జాగ్రత్తలు తీసు కోవాలని హెచ్చరించింది. ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల యజమానులు తప్పుడు ప్రచారాల నిరోధానికి తమ వంతు కృషి చేయకపోతే మరియు ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలు వీటి వినియోగం పై కఠినతరమైన నియంత్రణా వ్యవస్థలను ఏర్పాటు చేయకపోతే మానవాళికి ఎంతో ప్రయోజనకరం గా వున్న సాంకేతిక పరిజ్ఞాం, క్షణాలలో వార్తలను ప్రపంచ నలుమూలలకు చేరవేయగలిగే సామర్ధ్యం వున్న సామాజిక మాధ్యమాలు మానవాళికి శత్రువుగా మారే ప్రమాదం వుంది. సి.హెచ్‌.సాయిప్రతాప్‌ 98808 51898

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు