Wednesday, July 24, 2024

‘నమస్తే తెలంగాణ’ పేపర్‌ను తప్పకుండా చదవండి..

తప్పక చదవండి

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో మాక్లూర్ మండలంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కవిత, మంత్రి మల్లారెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రజల కోసం శ్రమిస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ చదవాలని, టీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాల‌ని సూచించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ స్ఫూర్తితో పనిచేసిన మన పేపర్ (న‌మ‌స్తే తెలంగాణ‌), మన టీవీ ఛానల్లో ఇప్పుడు కూడా అదే రకంగా ఆదరించాలని కోరారు. బీజేపీ ఛానల్ మన గురించి చెడుగా చూపెడుతుందని మన వార్తలు మన ప్రజలకు చేరాలంటే నమస్తే తెలంగాణ, T న్యూస్ మాత్రమే ఆ బాధ్యతను పూర్తి చేస్తాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు