Friday, May 17, 2024

వేములవాడ బిజెపి అభ్యర్థి మార్పు

తప్పక చదవండి
  • తుల ఉమ స్థానంలో వికాస్‌రావుకు టిక్కెట్‌
  • ఈటెలను కాదని బండికి లొంగిన అధిష్టానం
  • పలుచోట్ల బీజేపీ రెబల్‌ అభ్యర్థలు నామినేషన్లు

వేములవాడ : వేములవాడ బీజేపీలో టికెట్‌ టెన్షన్‌ వీడిరది. తొలుత ఈటల రాజేందర్‌ అనుచరురాలు తుల ఉమను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వికాస్‌ రావుకు టికెట్‌ కేటాయించాలనడంతో బీజేపీ అధిష్టానం సందిగ్ధంలో పడిపోయింది. మొత్తానికి టెన్షన్‌ అయితే వీడిరది. మాజీ కేంద్రమంత్రి విద్యాసాగర్‌ రావు కుమారుడు వికాస్‌ రావు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసారు. ముందు తుల ఉమను బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించి.. చివరి రోజు నిర్ణయాన్ని మార్చుకోవడంతో టెన్షన్‌ నెలకొంది. ఇప్పటికే ఆ స్థానం నుంచి తుల ఉమ నామినేషన్‌ కూడా వేసేశారు. అయితే తాజాగా వికాస్‌రావుకు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ బీఫామ్‌ ఇవ్వడం గమనార్హం. వికాస్‌రావు టికెట్‌పై బండి సంజయ్‌ గట్టిగా పట్టుబట్టడంతో అధిష్టానం మార్పు చేయక తప్పలేదు.వేములవాడ బీజేపీ టికెట్‌ దక్కకపోవడంతో తుల ఉమ కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరి నిమిషంలో బీజేపీ అగ్రనాయత్వం అభ్యర్థిని మార్చడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని, వేములవాడలో కచ్చితంగా పోటీ చేస్తానని తుల ఉమ స్పష్టం చేశారు. అభ్యర్థిని మార్చినట్లు కనీసం సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఈటెలతో పాటు ఆమె బిజెపిలో చేరారు. గతంలో కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. మొదట వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ ఉన్నారు. చివరి నిమిషంలో మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు కుమారుడికి వేములవాడ బీజేపీ టికెట్‌ ఇవ్వడంపై తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీలో మహిళా నేతల కన్నీరు పెట్టుకుంటున్నారు. టికెట్‌ దక్కకపోవడంతో పలుచోట్ల రెబల్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. 13న నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ రోజు నామినేషన్ల స్వీకరణకు చివరిరోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి నిమిషంలో బీజేపీ అగ్రనాయత్వం అభ్యర్థులను మార్చడంతో బీజేపీలో మహిళా నేతల కన్నీరు పెట్టుకుంటున్నారు. టికెట్‌ దక్కకపోవడంతో పలుచోట్ల రెబల్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. మెన్న నిర్మల్‌ రమాదేవి.. నేడు వేములవాడలో తుల ఉమ, కంటోన్మెంట్‌లో రజనీ టికెట్‌ దక్కకపోవడం ఆవేదన చెందుతున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ సీటును గణెళిష్‌ నారాయణ్‌కు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తిలో బీజేపీ ఆశావాహులు ఉన్నారు. రాష్ట్ర నేతలు కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ లు మోసం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. కంటోన్మెంట్‌ బీజేపీ నేత రామకృష్ణ బ్రోకర్‌ మాదిరి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుడి జేబులో కిషన్‌ రెడ్డి, ఎడవ జేబులో లక్ష్మణ్‌ ఉన్నాడని గణెళిష్‌ చెప్తున్నాడని, టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గణెళిష్‌ నారాయణ్‌కు రాత్రికి రాత్రే బీజేపీ టికెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ బహిరంగ సభలకు మైక్‌ సెట్‌లు పెట్టే రామకృష్ణ అనే బ్రోకర్‌ వల్లనే ఇదంతా జరిగిందని ఆవేదన చెందుతున్నారు. తమ పార్టీ పెద్దలు కనీసం తమకు చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ టికెట్‌ ఆశించి నేతలు భంగపడ్డారు. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను మార్చడంతో పలుచోట్ల రెబల్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు