Wednesday, October 9, 2024
spot_img

మెదక్‌ రహదారులు… నరకానికి దారులు

తప్పక చదవండి
  • కమీషన్‌ల కక్కుర్తితో పూర్తిగాని పనులు
  • అధికారుల నిర్లక్ష్యంతో అసంపూర్తి
  • ఇదేం మాయరోగం అంటూ ప్రజల ఆవేదన
    మెదక్‌ : ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందన లా మారింది మెదక్‌. మెదక్‌ రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు కమిషన్లకు కక్కుర్తి పడి ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

సుమారు నాలుగు సంవత్సరాల నుండి రహదారి పనులు పూర్తికాకపోవడంతో వారి అవినీతికి అద్దం పడుతుంది. ప్రభుత్వశాఖ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు దాటవేస్తున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం సుమారు ఏడు కోట్ల నిధులు రహదారి పనులకు మంజూరయ్యాయి. కాగా ఒక ప్రజా ప్రతినిధి భర్త తనకు కమిషన్‌ కావాలంటూ తీష్ట వేయడంతో సదరు కాంట్రాక్టర్‌ కొంత పని చేసి వెళ్లిపోయినట్లు విశ్వాసం వర్గాల సమాచారం. తిరిగి మరో కాంట్రాక్టర్‌ కు పనులు అప్పగించడంతో మళ్లీ కమిషన్‌ కావాలంటూ డిమాండ్‌ చేయగా ఆ కాంట్రాక్టర్‌ సైతం పనులు వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది.

దాంతో గత రెండు సంవత్సరాల నుండి రహదారి అవస్థలు వర్ణతితంగా మారాయి. ఇదే మాయ రోగం అంటూ రోదన చేస్తున్నారు. మెదక్‌ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఈనెల 19న మెదక్‌ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే, దీంతో పాలకులు అధికారులు ఆగా మేఘాలమీద పనులను చేపడుతున్నారు. రహదారి వెంట గుంతలు పూడ్చడం మొదలుపెట్టి రహదారి పనులు ప్రారంభించారు. రహదారి శాఖ అధికారి వివరణ కోరగా 2020బి2021 సంవత్సరంలో ఏడు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని నాలుగు కోట్ల పనులు పూర్తయ్యాయని మిగతా మూడు కోట్ల నిధులతో పనులతో చేస్తున్నట్లు వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు