చివ్వెంల : చిన్నపిల్లలకు ఆరణ పాలన చూసే (పాలబడి) అంగన్ వాడి తాగుబోతులకు అడ్డాగా మారింది. చివ్వెంల మండల కేంద్రంలోని అంగన్ వాడి కేంద్రం టు బిల్డింగ్ నిర్మాణం నూతనంగా జరిగింది. గతంలో గ్రామంలోని ఎస్.సి కాలనీలో ఒకటే అంగన్వాడి సెంటర్ ఉండేది. మండల కేంద్రం కావడంతో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు మరొక అంగన్ వాడి సెంటర్ ను మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేశారు.

అంగన్ వాడి టు ఏర్పడిన కానుండి కొంతమంది రాత్రి వేళలో ఇక్కడ మద్యం సేవిస్తూన్నారు. అయితే ఈ బిల్డింగ్ అతి కొద్ది ప్లేస్ లోనే నిర్మాణం కావడంతో ఈ బిల్డింగ్ కు చుట్టూ ఎలాంటి రక్షణ గోడ లేకపోవడంతో బిల్డింగ్ ముందరా ఉన్న వరండాలో రాత్రిపూట కొంతమంది తాగుబోతులు మద్యం తీసుకువచ్చి అక్కడ సేవించి,మద్యం సేవించిన అనంతరం సీసాలను అక్కడే వదిలేయడంతో పాటు కొన్ని సందర్భాలలో సీసాలను పగలగొట్టడంతో అంగన్ వాడికి వచ్చే పిల్లలు, వారి తల్లిదండ్రులు, అంగన్వాడి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టూరా ఉన్న స్థానికులు మాత్రం ఇది కొత్తవి కాదని ఇక్కడ ప్రతిరోజు రాత్రి మద్యం సేవించుతూనే ఉంటారని చెప్తున్నారు. అధికారులు స్పందించి అంగన్ బడి చుట్టూ రక్షణ గోడ ఏర్పాటు చేసి,స్కూల్ వద్ద మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.