Saturday, July 27, 2024

లంచం ఇస్తేనే… పని చేస్తానంటున్న పంచాయితి కార్యదర్శి

తప్పక చదవండి
  • ప్రతి పనికొక రేటు ఆ ప్రకారమే లంచం
  • కలెక్టర్‌ విపి గౌతమ్‌ సారూ స్పందించాలి
  • విచారించి విధులు నుండి తొలగించాలి

గ్రామ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పారదర్శకంగా పనిచేయాల్సిన పంచాయితి కార్యదర్శి పైసలు ఇస్తే తప్ప పనిచేయట్లేదు. ప్రతి ష్టాత్మకమైన ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాల్సినది పోయి అక్రమ వసూళ్లకు తెరలేపింది.ఈమె చేసిన అక్రమ వసూ ళ్లను చూస్తే ఎవరైనా హవ్వ అనాల్సిందే. ఇది తిరుమలా యపా లెం మండలంలోని కాకరవాయి గ్రామపంచాయతీలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మేకల పావని అక్రమాల పర్వం.పెన్షన్‌ మంజూరు చేయాలన్నా,ఇంటి నెంబర్‌ ఇవ్వాలన్నా, గృహ నిర్మాణాలకు అనుమతులు,జనన, మరణ ధృవీ కరణ పత్రాలు కావాలన్నా ఆమె అడిగినంత ఇవ్వాల్సిందే.లేదంటే
ఫైల్‌ ముందుకు కదలదు ఆ పని కాదు. పలు రకాల కారణాలు చూపి సంబంధిత దరఖాస్తులను తిరస్కరిస్తుంది. ప్రతి పనికి ఒక రేటు…గ్రామంలో పలు పనుల నిమిత్తం పంచాయితి కార్యాలయానికి వచ్చే బాధితులకు,వాటి పనిని బట్టి పనికొక రేటును నిర్ణయించి ఆ రేటు ప్రకారమే పనిచేస్తుంది. ప్రజలకు కావాల్సిన న్యాయబద్దమైన పని చేయాలంటే కచ్చితంగా ఆమె అడిగినంత ముట్ట చెప్పాల్సిందే.గ్రామస్తుల నుండి లంచం తీసుకోవడమే పెద్ద నేరం, ఓ వైపు అవినీతి అక్రమాలకు పాల్పడుతూనే ప్రజలపై జులుం ప్రదర్శిస్తుంది.చిన్నా పెద్ద తారతమ్యం ఉండదు. కనీసం వయసుకు కూడా గౌరవించ కుండా ప్రజల ముక్కు పిండి మరి లంచం వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటుంది.ఆమె అడిగినంత అందుకుంటునే మరోపక్క బాధితులతో బెదిరింపులకు పాల్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇక ఆమె గ్రామంలో పలు అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ వారి వద్ద నుంచి లక్షల రూపాయల సొమ్మును వక్రమార్గంలో అందుకుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

కాళ్ల పై పడిన కనికరించని కార్యదర్శి…పలువురు వితంతు, ఒంటరి మహిళలు,వృద్దులు ఆసరా పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా గ్రామ స్థాయిలో విచారణ అధికారిగా ఉన్న మేకల పావని పెన్షన్‌ మంజూరు చేయడానికి ఒక్కొక్కరి నుంచి వేల రూపాయల లంచం తీసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆసరా పెన్షన్‌ మీదనే ఆధారపడే ముసలి వారిని కూడా వదల లేదని వారి దగ్గర నుంచి కూడా ముడుపులు అందుకున్నట్లు పలువురు వృద్ధులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కార్యదర్శి పావని చేసే పనులు అసహ్యించుకునే విధంగా ఉన్నాయని, కొందరు కడు బీధ వృద్దులు లంచం ఇవ్వలేనని ఆసరా పెన్షన్‌ కార్డు ఇవ్వాలని కార్యదర్శి మేకల పావని కాళ్లా వెళ్ళాపడిన కనకరించకుండా కఠినంగా వ్యవహరించి పైసలు వసూలు చేసిందని రోదిస్తున్నారు. కలెక్టర్‌ విపి గౌతమ్‌ సారూ కాస్త స్పందించరూ… పంచాయతీ కార్యదర్శి మేకల పావని చేస్తున్న అక్రమాలకి స్ధానిక ఎంపీఓ రాజేశ్వరి సహకారంతో కార్యదర్శి పావని లంచానికి అలవాటు పడిరదని సమాచారం.అందుకే గతంలో ఆమె పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదన వినిపిస్తోంది.ఈ అక్రమాల పై జిల్లా కలెక్టర్‌ విపి గౌతమ్‌ స్పందించి విచారణ కై ఓ ప్రత్యేక అధికారిని నియమించి మేకల పావని పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు