Friday, April 26, 2024

అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లిని మరిచిన పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్..

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాల పేరుతో ఘనంగా నిర్వహిస్తుంటే రాష్ట్రం లోనే నెంబర్ వన్ మున్సిపల్ కార్పోరేషన్ అని చెప్పుకునే పీర్జాదిగుడా మున్సిపల్ కార్పోరేషన్ లో మున్సిపల్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ కు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ముందు ఉండే అమరవీరుల స్థూపనికి, తెలంగాణ తల్లి విగ్రహంకి కనీసం పూలమాల వేసే దిక్కులేదు. అమరుల త్యాగాలు లేనిదే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది… తెలంగాణ లేనిది ఈ మునిసిపల్ కార్పొరేషన్ ఎక్కడిది…ఈ పాలకమండలి ఎక్కడిది… ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే…ముప్పై మూడు లక్షల ఖర్చుతో దశాబ్ది ఉత్సవాలు చేసే నాయకులకు మూడు మూరల పులా దండ అమరవీరుల స్థూపంకి తెలంగాణ తల్లికి వేయడానికి లేవా…? లేక తెలంగాణ రాష్టం వచ్చింది మేము అధికారపీఠం ఎక్కినం ఇక అమరుల తోటి మరియు ఉద్యమకారుల తో మాకేం పని అని నిర్లక్ష్యం చేస్తున్నారా…? ఏ రోజు ఉద్యమంలో పాల్గొనని వారు ఫైరవిలతో పదవులు తెచ్చుకున్న వారికి ఏం తెలుసు అమరుల త్యాగాలు…? ఉద్యమకారుల విలువ, అంటూ పీర్జాదిగుడాలో ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు