బ్రిటన్ రాజు చార్లెస్ – 3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ మరోసారి వార్తల్లో నిలిచారు. వచ్చే వారం ఓ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఆయన లండన్ హైకోర్టుకు హాజరుకానున్నారు. 130 ఏండ్ల తర్వాత కోర్టు మెట్లెక్కుతున్న బ్రిటన్ రాజవంశీకుడు ఆయన. డైలీ మిర్రర్, సండే మిర్రర్, సండే పీపుల్ అనే పత్రికలను ప్రచురించే మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్(ఎంజీఎన్) అనే సంస్థ తమ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునేందుకు ఫోన్ హ్యాకింగ్ సహా చట్టవ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడుతున్నదని ప్రిన్స్ హ్యారీ సహా 100 మంది ప్రముఖులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సాక్షిగా ప్రిన్స్ హ్యారీ కోర్టుకు హాజరుకానున్నారు.