Wednesday, May 15, 2024

బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల..

తప్పక చదవండి
  • ఏడు స్థానాల్లో క్యాండిడేట్స్‌ మార్పు..
  • పెండింగ్ లో ఉన్న స్థానాలు నాంపల్లి, గోషామహల్,
    నరసాపూర్, జనగాం..
  • 115 మంది అభ్యర్థుల ఖరారు..
  • ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా సహించేది లేదు..
  • 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం..
  • నేను రెండు స్థానాలనుంచి పోటీ చేస్తా : కేసీఆర్..

హైదరాబాద్ :
ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా ఏకంగా 115 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మెజారిటీ సిట్టింగ్‌ అభ్యర్థులను కొనసాగిస్తుండగా, కొన్ని స్థానాల్లో మాత్రం మార్పులు చేశారు. కొన్ని స్థానాల్లో పార్టీకి ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం చెప్పుకొచ్చారు. అభ్యర్థులను ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ సంచనల వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ నుంచి బయటకు పంపిస్తామని తేల్చి చెప్పారు. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్‌.. నేతల్లో అసమ్మతి సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేతల విజ్ఞప్తి మేరకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఎమ్‌ఐఎమ్‌ తమకు మిత్రపక్షమని మరోసారి సీఎం స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలా జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్‌ కొన్ని స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. వీటిలో నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్‌, జనగాం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. ఈసారి తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రస్తుతం గజ్వెల్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీఆర్‌, ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఈసారి కూడా పెద్దగా మార్పులు లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కొన్ని స్థానాల్లో ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. వేములవాడలో ఎమ్మెల్యే పౌరసత్వం వివాదం నేపథ్యంలో మార్చాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.

- Advertisement -

కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల వివరాలు :
ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా :
సిర్పూర్ : కొనేరు కోనప్ప.. చెన్నూరు : బాల్క సుమన్.. బెల్లం పల్లి : దుర్గం చిన్నయ్య.. మంచిర్యాల : దివాకర్ రావు.. ఆసిఫాబాద్ : కోవ లక్ష్మి.. ఖానాపూర్ : జాన్సన్ నాయక్.. ఆదిలాబాద్ : జోగు రామన్న.. బోథ్ : అనిల్ జాదవ్.. నిర్మల్ : ఇంద్రకరణ్ రెడ్డి.. ముధోల్ : విఠల్ రెడ్డి..

నిజామాబాద్ జిల్లా :
ఆర్మూరు : జీవన్ రెడ్డి.. బోధన్ : షకీల్ అహ్మద్.. జుక్కల్ : హన్మంత్ షిండే.. బాన్సువాడ : పోచారం శ్రీనివాసరెడ్డి.. ఎల్లారెడ్డి : జాజుల సురేందర్.. కామారెడ్డి : కేసీఆర్.. నిజామాబాద్ అర్బన్ : బిగాల గణేశ్ గుప్త.. నిజామాబాద్ రూరల్ : బాజిరెడ్డి గోవర్ధన్.. బాల్కొండ : వేముల ప్రశాం త్ రెడ్డి ..

కరీంనగర్ జిల్లా :
కోరుట్ల : కల్వకుంట సంజయ్.. జగిత్యా ల : డాక్టర్ సంజయ్ కుమార్.. ధర్మపురి : కొప్పుల ఈశ్వర్.. రామగుండం : కొరుకంటి చందర్.. పెద్దపల్లి : దాసరి మనోహర్ రెడ్డి.. కరీంనగర్ : గంగుల కమలాకర్.. చొప్పదండి : సుంకే రవిశంకర్.. మంథని : పుట్ట మధు.. వేములవాడ : చలిమెడ లక్ష్మీ నరసింహారావు.. సిరిసిల్ల : కేటీఆర్
మానకొండూరు : రసమయి బాలకిషన్.. హుస్నాబాద్ : ఒడితెల సతీష్ బాబు.. హుజూరాబాద్ : పాడి కౌశిక్ రెడ్డి..

మెదక్ జిల్లా :
సిద్దిపేట : హరీశ్‌రావు.. మెదక్ : పద్మా దేవేందర్ రెడ్డి.. నారాయణఖేడ్ : భూపాల్‌రెడ్డి.. ఆంధోల్ : క్రాంతి కిరణ్.. నర్సాపూర్ : పెండింగ్.. జహీరాబాద్ : మాణిక్ రావు
పటాన్‌చెరు : గూడెం మహిపాల్ రెడ్డి.. గజ్వేల్ : కేసీఆర్.. సంగారెడ్డి : చింతా ప్రభాకర్.. దుబ్బాక : కొత్త ప్రబాకర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా :
మేడ్చల్ : మల్లారెడ్డి.. మల్కా జిగిరి : మైనంపల్లి హన్మంతరావు.. కుత్బుల్లాపూర్ : కేపీ వివేకానంద గౌడ్.. కూకట్‌పల్లి : మాధవరం కృ ష్ణారావు.. ఉప్పల్ : బండారి లక్ష్మారెడ్డి.. ఇబ్రహీం పట్నం : మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. ఎల్బీ నగర్ : సుధీర్ రెడ్డి.. మహేశ్వరం : సబితా ఇంద్రారెడ్డి .. రాజేంధ్రనగర్ : ప్రకాశ్ గౌడ్.. శేరిలింగంపల్లి : అరికెపూడి గాంధీ.. చేవెళ్ళ : కాలె యాదయ్య.. పరిగి : మహేశ్ రెడ్డి.. వికారాబాద్ : మెతుకు ఆనంద్.. తాండూరు : పైలట్ రోహిత్ రెడ్డి

హైదరాబాద్ జిల్లా :
ముషీరాబాద్ : ముఠాగోపాల్.. అంబర్‌పేట్ : కాలేరు వెంకటేశ్.. ఖైరతాబాద్ : దానం నాగేందర్.. జూబిలీహిల్స్ : మాగంటి గోపీనాధ్.. సనత్ నగర్ : తలసాని శ్రీనివాసయాదవ్.. సికింద్రాబాద్ : పద్మా రావు గౌడ్.. కంటోన్మెంట్ : లాస్య నందిత.. చార్మినార్ : ఇబ్రహీం లోడి.. చాంద్రాయణ్‌గుట్ట : సీతారాం రెడ్డి.. యాకుత్‌పురా : సామ సుందర్ రెడ్డి.. బహదూర్‌పురా : అలీ బక్రీ.. కార్వాన్ : అయందల కృష్ణయ్య.. మలక్‌పేట్ : తీగల అజిత్ రెడ్డి.. నాంపల్లి : పెండింగ్.. గోషామహల్ : పెండింగ్

మహబూబ్‌నగర్ జిల్లా :
కొడంగల్ : పట్నం నరేందర్ రెడ్డి.. నారాయణ్‌పేట్ : రాజేందర్ రెడ్డి.. మహబూబ్‌నగర్ : శ్రీనివాస గౌడ్.. జడ్చర్ల : లక్ష్మారెడ్డి.. దేవరకద్ర : ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి.. మక్తల్ : చిట్టెం రామ్మోహన్ రెడ్డి.. వనపర్తి : నిరంజన్ రెడ్డి.. గద్వాల్ : కృష్ణమోహన్ రెడ్డి.. ఆలంపూర్ : అబ్రహం.. నాగర్‌ కర్నూల్ : మర్రి జనార్ధన్ రెడ్డి.. అచ్చంపేట్ : గువ్వల బాలరాజు.. కల్వకుర్తి : జైపాల్ యాదవ్.. షాద్‌ నగర్ : అంజయ్య యాదవ్.. కొల్లాపూర్ : బీరం హర్షవర్ధన్ రెడ్డి

నల్లగొండ జిల్లా :
దేవరకొండ : రవీంద్రకుమార్ నాయక్.. నాగార్జున సాగర్ : నోముల భగత్ కుమార్.. మిర్యాలగూడ : నల్లమోతు భాస్కర రావు.. నల్లగొండ : కంచర్ల భూపాల్‌రెడ్డి.. మునుగోడు : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. భువనగిరి : పైళ్ళ శేఖర్ రెడ్డి.. నకిరేకల్ : చిరుమర్తి లింగయ్య.. తుంగతుర్తి : గాదరి కిషోర్.. ఆలేరు : గొంగిడి సునితారెడ్డి

వరంగల్ జిల్లా :
జనగాం : పెండింగ్.. స్టేషన్ ఘన్‌పూర్ : కడియం శ్రీహరి.. పాలకుర్తి : ఎర్రబెల్లి దయాకర్ రావు.. డోర్నకల్ : రెడ్యా నాయక్.. మహబూబాబాద్ : శంకర్ నాయక్.. నర్సంపేట్ : పెద్ది సుదర్శన్ రెడ్డి.. పరకాల : చల్లా ధర్మారెడ్డి.. వరంగల్ ఈస్ట్ : నన్నపనేని నరేందర్.. వరంగల్ వెస్ట్ : దాస్యం వినయభాస్క ర్
వర్ధన్నపేట : ఆరూరి రమేశ్.. భూపాలపల్లి : గండ్ర వెంకటరమణా రెడ్డి.. ములుగు : బడే నాగజ్యో తి..

ఖమ్మం :
పినపాక : రేగా కాంతారావు.. ఇల్లెందు : హరిప్రియ నాయక్.. ఖమ్మం : పువ్వాడ అజయ్ కుమార్.. పాలేరు : కందాళ ఉపేందర్ రెడ్డి.. వైరా : మదన్ లాల్.. సత్తుపల్లి : సండ్ర వెంకట వీరయ్య.. కొత్తగూడెం : వనమా వెంకటేశ్వర రావు.. అశ్వారావు పేట : మెచ్చా నాగేశ్వ రరావు.. మధిర : లింగాల కమల్‌ రాజ్.. భద్రాచలం : తెల్లం వెంకట్రావు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు