- సంచలన వ్యాఖ్యలు చేసిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
న్యూ ఢిల్లీ :
త్వరలో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా నంబర్ 4లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా తాను పలానా స్థానంలో బ్యాటింగ్ చేస్తానని ఎవరు అనుకోకూడదని, అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. ఎందుకంటే ఇది అంతర్జాతీయ క్రికెట్ అని, క్లబ్ క్రికెట్ కాదని రోహిత్ అన్నాడు. “నేను ఈ స్థానంలో ఆడతాను. అని ఎవరూ అనుకోకూడదు. అవసరమైనప్పుడు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల కుర్రాళ్ళు కావాలి. ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఇది అంతర్జాతీయ క్రికెట్. క్లబ్ క్రికెట్ కాదు. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి’ అని రోహిత్ చెప్పాడు.
కాగా చాలా కాలంగా వన్డే ఫార్మాట్‌లో భారత్‌ను నంబర్ 4 పొజిషన్ ఇబ్బంది పెడుతోంది. యువరాజ్ సింగ్ తర్వాత ఆ నంబర్‌లో మరో బ్యాటర్ నిలకడగా రాణించలేకపోయాడు. ఆ మధ్య శ్రేయస్ అయ్యర్‌ను నాలుగో స్థానంలో ఖాయం చేసినప్పటికీ.. గాయాలతో అతను జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆసియాకప్‌నకు రీఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ నాలుగో స్థానంలో అతనే వస్తాడని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ తాజా వ్యాఖ్యలతో శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడడం అనుమానంగా మారింది. అయితే రైట్, లెఫ్ట్ కాంబినేషన్ కోసం నాలుగో స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించే అవకాశాలున్నాయని సమాచారం. అందుకే రోహిత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని విశ్లేషకులు అంటున్నారు. అప్పుడు శ్రేయస్, రాహుల్ ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధాన వికెట్ కీపర్ జట్టులో ఉండాలని భావిస్తే కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం తప్పనిసరి. అప్పుడు రాహుల్, అయ్యర్‌లో ఒక్కరినే ఆడించొచ్చు. లేదంటే ఇద్దరినీ ఆడించినచో బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఒకరిని తగ్గించే అవకాశాలుంటాయి. బహుషా ఈ ఉద్దేశంతోనే కాబోలు రానున్న ప్రపంచకప్‌లో తాను విరాట్ కోహ్లీ బౌలింగ్ కూడా చేస్తామని రోహిత్ శర్మ చెప్పాడు.
టీమిండియా టీం :
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (స్టాండ్ బై)