Wednesday, April 24, 2024

యూనిక్ బర్త్ కేర్ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ కోర్సు

తప్పక చదవండి
  • దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 29 చివరి తేదీ
  • ఉద్యోగ భవిష్యత్‌కు అవకాశాలు పుష్కలం..

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ నేతృత్వంలోని బర్త్ కేర్ ప్రాక్టీషనర్ (బర్త్ డౌలా) ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధిచిన చివరి తేదీ సమీపిస్తోంది. యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ డిజిటల్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు అందించబడుతుంది. ఈ కోర్సులో భాగంగా గర్భం, జననం, తక్షణ ప్రసవానంతర సమయానికి సంబంధిత కుటుంబాలను ఆదుకోవడంలో నైపుణ్యాలు, విజ్ఞానాన్ని నేర్పుతుంది. 10+2 విద్యలో ఉత్తీర్ణత, ఆంగ్లంలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పాటు గర్భిణీ జంటలకు సహాయం చేయాలనే అభిరుచి ఉన్న అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించడానికి చివరి రోజు 29 ఫిబ్రవరి 2024.

ఈ కోర్సుకు శిక్షణ అందించే ఫ్యాకల్టీలో ఫెర్నాండెజ్ హాస్పిటల్‌లో డౌలా సపోర్ట్ సర్వీసెస్ హెడ్‌ పూజా షెనాయ్, సర్టిఫైడ్ లేబర్ డౌలా విభాగంలో 30 ఏళ్లకు పైగా అనుభవమున్న సెలెస్టినా కావిందర్ ఉన్నారు. ఈ కోర్సు కోసం నమోదు చేసుకున్న తర్వాత., అభ్యర్థికి 6 నెలల శిక్షణ + 6 జననాలకు బర్త్ సపోర్ట్‌తో సహా కోర్సును పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల సమయం ఉంటుంది. శిక్షణలో స్వీయ-గమన (స్వయం పరిశీలన) ఇ-లెర్నింగ్ మాడ్యూల్స్, బర్త్ సపోర్ట్, ప్రత్యేక చర్చలతో పాటు 4 శిశుజనన తరగతులను బహిర్గతం నిర్వహిస్తారు. కోర్సు నిర్మాణంలో ముఖ్యంగా 45 గంటల ప్రత్యేక పఠనం, మెంటర్‌లతో 15 గంటల పాటు చర్చలు కొనసాగుతాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో రాబోయే కోర్సు గురించి ఫెర్నాండెజ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ మాట్లాడుతూ, “వినూత్నమైన ఈ సర్టిఫికేట్ కోర్సును అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఇది ఒక అభ్యర్థి బర్త్ డౌలా పాత్ర గురించి తెలుసుకోవడానికి, నిరంతర శారీరక, మానసిక, సమాచార మద్దతును అందించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ కోర్సుతో ప్రసవానికి ముందు, తరువాత మరియు ప్రసవానంతరం మరికొంత కాలం తర్వాత ఆ జంటలకు సానుకూల-సాధికారత కల్పిస్తూ., మధురమైన జనన అనుభవాన్ని సాధించడంలో సహాయపడాలని’’ ఆశించారు.

ప్రస్తుత తరుణంలో ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు చాలా మంచి కెరీర్ అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా సరే ఒక డౌలా ఒక జననానికి రూ.15,000 నుండి 35,000 లేదా అంతకంటే ఎక్కువ కూడా సంపాదించవచ్చు. సాధారణంగా బర్త్‌ సెంటర్స్‌ (జనన కేంద్రాలు) డౌలా విధానానికి స్నేహపూర్వకంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఆసుపత్రులు కూడా సుశిక్షితులైన, ప్రొఫెషనల్ డౌలాస్ అందించే జనన సహాయానికి విలువనివ్వడం ప్రారంభించాయి. డౌలా కేవలం మద్దతును మాత్రమే కాకుండా గర్భిణీ జంటలకు ప్రినేటల్ యోగా, ప్రసవ విద్య, చనుబాలివ్వడం, కౌన్సెలింగ్, హిప్నోబర్థింగ్ వంటి అదనపు సహాయ సేవలను అందించడానికి సర్టిఫికేట్ శిక్షణ పొందవచ్చు. ఈ శిక్షణ ప్రసవం, ప్రసవానంతర పరిస్థితులు, చైల్డ్‌ బర్త్‌ తదితర అంశాల్లో అవగాహాన పెంచడానికి సహాయకారిగా పనిచేస్తుంది.

గత సంవత్సరం జనవరిలో ఫెర్నాండెజ్ ఫౌండేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో అకడమిక్ ఎక్స్ఛేంజ్, రీసెర్చ్ అండ్‌ ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ ఇనిషియేటివ్‌లను చేపట్టేందుకు మూడు సంవత్సరాల అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు