Friday, May 17, 2024

కురుమల ద్రోహి ముఖ్యమంత్రి కేసీఆర్…

తప్పక చదవండి
  • రాష్ట్రంలో ఏ ఒక్క కురుమకు కూడా దక్కని ఎమ్మెల్యే టికెట్….
  • తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న కురుమ కులస్తులు…
  • జనగామ జిల్లా కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచ రాములు

జనగామ :
మంగళవారం రోజు జనగామ పట్టణ కేంద్రంలో కురుమ సంఘం, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచ రాములు పాల్గొని మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో కులాల వారిగా చూసుకుంటే అత్యధిక జనాభా ఉన్న కురుమ కులస్తులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం కేసీఆర్ దొర అహంకారానికి నిదర్శనం పట్టేలా ఉంది అని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మన కులానికి బీ.ఆర్.ఎస్. పార్టీ ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్ కూడ కేటాయించలేదు. కేసిఆర్ కి కురుమలు అంటే లెక్కలేదని అన్నారు.
ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్న కురుమ సంఘం నాయకులకు ముందు గ్రామ స్థాయిలో మార్పు రావాలి.. మన కులాన్ని విస్మరించిన బీ.ఆర్.ఎస్. పార్టీని విడనాడాలి. బీ.ఆర్.ఎస్. పార్టీకి కురుమలు ఎవరూ ఓటు వేయవద్దు. రాష్ట్రంలో ఉన్న కురుమలు అందరూ మూకుమ్మడిగా బి.ఆర్.ఎస్. పార్టీకి రాజీనామాలు చేయాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కురుమ కులస్తులు చేసిన ఉద్యమం ఎంతో గొప్పదని, ప్రతి గ్రామం నుండి కురుమ సంఘం నాయకులు తెలంగాణ రాష్ట్రo కోసం పోరాడి సాధించుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు.. కురుమ కులస్తులు తెలంగాణ ఉద్యమ సమయంలో గొర్లతో రోడ్లెక్కి ధర్నా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే.. ఈ రోజు పదవులు మాత్రం కేసీఆర్ కుటుంబానికి చెందాయి.

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కురుమ సంఘం ఉపాధ్యక్షుడు, లీగల్ సెల్ నాయకులు ఆలేటి సిద్ది రాములు, జనగామ జిల్లా కురుమ సంఘం ఉపాధ్యక్షులు మోటే శ్రీనివాస్, కురుమ సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు నోముల సోమయ్య, బోరెల్లి సిద్ధులు, పిక్క బీరప్ప, దేవర సత్తయ్య, మోటే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు