Thursday, May 16, 2024

గవర్నర్ తమిళి సై చేతుల మీదుగా ఖైరతాబాద్ గణేష్ పూజలు..

తప్పక చదవండి
  • 63 కిలోల పూర్తి సేంద్రీయ లడ్డును సమర్పించిన
    స్వామి భక్తుడు, సామాజిక వేత్త శివన్న..
  • ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో, ఇండియన్ వరల్డ్ రికార్డ్ లో స్థానం
    సంపాదించిన ఘనత సాధించిన లడ్డు..
    శివన్నకు సర్టిఫికేట్ అందించిన గవర్నర్..
  • తన జన్మ ధన్యమైందన్న శివన్న..
  • సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన వైనం..
  • శ్రీ గణనాథుడి కృపాకటాక్షాలు అందరిమీద
    ఉండాలని ప్రార్ధించిన శివన్న..
  • అశేష భక్త జనవాహిని జేజేలు అందుకున్న ఖైరతాబాద్ గణపతి..

హైదరాబాద్ : జై గణనాథాయ.. గణపతి బొప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా.. అంటూ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగిపోయాయి.. కిట కిటలాడే భక్త జనసందోహంతో ఖైరతాబాద్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది.. అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భక్తిపూర్వక మధుర క్షణాలు కళ్ళముందు సాక్షాత్కరించాయి.. ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు..

కాగా ఈసారి ఒక అద్భుత దృశ్యం గణేశుడి సాక్షిగా సాక్షాత్కరించింది.. శోభకృత్ నామ సంవత్సర వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ లో 69వ సంవత్సరపు 63 అడుగులలో దర్శనమిస్తున్న శ్రీ దశమహా విద్యా గణపతికి.. పరమశివుని భక్తుడు శివన్న ఆధ్వర్యంలో దేశంలోనే ప్రప్రధమంగా 63 కిలోల పూర్తి సేంద్రియ (ఆర్గానిక్) లడ్డూని, నిష్టాగరిష్టులైన ఆరుగురు వేద పండితుల సమక్షంలో బెంగాల్ నుండి శనగపిండిని, శర్కరా (పంచదార) ను తెప్పించి, జీడిపప్పును పలాస (శ్రీకాకుళం జిల్లా) నుండి ఎండు ద్రాక్షను, ప్రత్యేకమైన బాదం చెట్టు ద్వారా బాదం పప్పును, నాణ్యమైన ఆయుర్వేద యాలుకలను, పరిపూర్ణమైన గోమాత యొక్క నెయ్యి, మైసూర్ నుండి ఘాటైనా సువాసన ఇచ్చే కర్పూర మిశ్రమాలతో కలగలిపి ఖైరతాబాద్ గణనాధునికి సమర్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అశేష భక్త జనవాహిని పాల్గొంది.. ఎందరో ప్రముఖులు గణనాధుని దర్శించుకుని తరించారు.. మరీ ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై ఈ మహోత్సవంలో పాల్గొని గణేశుని పూజలు నిర్వహించారు.. తెలంగాణ ప్రజలు సుఖ శాంతులతో వెలుగొందాలని ఆమె ఆకాంక్షించారు.. మరీ ముఖ్యంగా అత్యంత ప్రత్యేకత కలిగిన లడ్డూను ఖైరతాబాద్ గణనాథుడికి సమర్పించిన భకుడైన శివన్నను ప్రత్యేకంగా ఆమె అభినందించారు..

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించినందుకు ఆమె శివన్నని ప్రత్యేకంగా అభినందిస్తూ.. సదరు సర్టిఫికేట్ ను తన చేతుల మీదుగా ఆమె శివన్నకు అందించారు.. ఈ అపురూప ఘట్టాన్ని చూసి భక్తులు పులకించి పోయారు.. గణనాథుడికి జేజేలు పలికారు..

కాగా ఇంతటి మహోన్నతమైన ఘట్టానికి పూర్తి సహాయ సహకారాలందించిన గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సింగరి రాజ్ కుమార్ కి, శివన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. సహకరించిన పెద్దలు ‘ఆదాబ్ హైదరాబాద్’ న్యూస్ పేపర్ ఎడిటర్ సత్యం వీరమళ్ళ, పగడాల అశోక్, మొగుళ్ళ నరేందర్, మీడియా సెలక్ట్ అధినేత నీలం రమేష్, కిసాన్ పరివార్ అధినేత ననావత్ భూపాల్ నాయక్, ఆకుల సతీష్, సహదేవ్, ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు, గజ్జెల ఆనంద్, వినోద్ కుమార్ యాదవ్, ఉదయ్, శ్రీధర్, శ్రీనివాస్ యాదవ్, రమాకాంత్, లడ్డూ తయారీదారడు శొంఠి బాబుల్ రెడ్డి, అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షుడు పుట్టా రాము, ముఖ్య సభ్యులు సత్య ప్రకాష్, దినేష్ రెడ్డి, అరుణ్ సింగ్, పొలమొని సహదేవ్, సంపత్ కుమార్, అనిరధ్, శ్రీకాంత్ రెడ్డి, అరుణ్, ఇతర ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు శివన్న, ఈ లడ్డూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించినందుకు వ్యవస్థాపకులైన వివేకానందబాబుని ప్రత్యేకంగా ప్రశంసించారు..

ఈ రికార్డ్ సాధించడం పట్ల గణేష్ ఉత్సవ కమిటీ వారు హర్షం వ్యక్తం చేసారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు