Monday, May 6, 2024

ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

తప్పక చదవండి

హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తలు వినబడుతున్నాయి. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో అసెంబ్లీకి వచ్చేందుకు.. క్రీయాశీలక రాజకీయాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. . ఫిబ్రవరి 1వ తేదీన మంచిరోజు కావడంతో.. అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ ఇంట్లో కాలు జారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక విరిగిపోయింది. యశోద ఆస్పత్రిలో చేర్పించగా.. శస్త్రచికిత్స చేసి తుంటి ఎముక రీప్లేస్ చేశారు. 8 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించగా.. కేసీఆర్ బెడ్‌ రెస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు కాస్త కోలుకోవడంతో ప్రజా క్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండటంతో.. ఎన్నికల కథన రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ముందుగా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు