Saturday, May 18, 2024

ఆత్మ గౌరవ భవనాలతో బీసీలలో ఆత్మాభిమానం నింపింది కేసిఆరే.

తప్పక చదవండి
  • నాయి బ్రాహ్మణ భవన భూమి పూజ చేసి శిలాఫలకానికి
    శంకుస్థాపన చేసిన డాక్టర్ వకుళాభరణం .

    హైదరాబాద్ : ఆత్మ న్యూనతను వదిలి ఆత్మాభిమానంతో బతికే దిశగా బీసీ వర్గాలలో సీఎం కేసీఆర్ ఆత్మగౌరవంను పెంపొందిస్తూ ఉన్నారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. కుల భవనాల నిమిత్తం వేలాది కోట్ల విలువ చేసే ఖరీదైన స్థలాలను ఉచితంగా కేటాయించి, నిర్మాణాలకు కూడా కోట్ల రూపాయల మంజూరు చేయటం, సీఎం కేసీఆర్ సామాజిక న్యాయ దృక్పథానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు .సోమవారం నాడు స్థానిక అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బాటసింగారం గ్రామ పరిధిలో నాయి బ్రాహ్మణ, మంగలి కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి, శిలాఫలకానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమం సమన్వయకర్తగా ట్రస్ట్ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ ఎం సూర్య నారాయణ, రాచమల్ల బాలకిషన్, పెందుర్తి శ్రీనివాస్, కే. కృష్ణ, గడల నాగరాజు, ఎం లింగం, ఎల్ సుధాకర్, బి చంద్రశేఖర్, ఏ.సూర్య నారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ.. పరిపాలకుడికి సమాజం పట్ల దార్శనికత ఉంటే ప్రజలు గొప్పగా జీవించగలుగుతారన్నారు. ఇక్కడ సీఎం కేసీఆర్ సామాజిక న్యాయ దృష్టితో చేస్తున్న కృషి గొప్పదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను రూపొందించి, తెలంగాణలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. బీసీలు సంఘటితంగా ఉంటూ సంక్షేమ పథకాలతో అభివృద్ధిలోకి రావాలన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు