Friday, May 10, 2024

ప్రమాదంలో కడెం ప్రాజెక్ట్..

తప్పక చదవండి
  • అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు..
  • ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువకు 90వేల క్యూసెక్కుల నీటి విడుదల..
  • ప్రవాహ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదని సూచన..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ 11 వరద గేట్లు ఎత్తి దిగువకు 90 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న గోదావరిలోకి వదులుతున్నారు.. ప్రాజెక్టు పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదని అధికారులు సూచించారు.

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు.. 7.603 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696.575 అడుగులు.. 6.738 టీఎంసీలలో కొనసాగుతోంది.. ఇన్ ప్లోగా ప్రాజెక్టులోకి 169300 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో.. ప్రాజెక్టు 11 వరద గేట్లు పైకి ఎత్తి 90000 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు.. కడెంవాగు పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు కూడా ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.. ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో మండల కేంద్రంలోని ప్రజలలో భయాందోళన మొదలైంది.. గత సంవత్సరం వరదలు మరవకముందే మళ్లీ ఈ సంవత్సరం కడెం ప్రాజెక్టుకు వరదలు పోటెత్తడంతో ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి ఉందన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు