Saturday, April 27, 2024

కేసీఆర్ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

తప్పక చదవండి
  • వర్షాలతో జనం అల్లాడుతుంటే ఫాంహౌజ్ లో తాగి పడుకుంటావా?
  • రైతులు, పేదలను ఆదుకోవాలనే సోయి కూడా లేదా?
  • నూతన పీఆర్సీ పేరుతో ఉద్యోగులు మోసం చేసేందుకు మరో కుట్రకు తెర..
  • ఎంఐఎం మెప్పు కోసం రూ.లక్ష సాయం పేరుతో మైనారిటీలను మోసం..
  • పులి చారల తోలు కప్పుకున్న గుంట నక్క కేసీఆర్…
  • కేసీఆర్ జీవితమంతా మోసాలే… హామీలను అమలు చేసేదాకా అంతు చూస్తా..

( బీజేపీ అంటేనే కేసీఆర్ కు భయం… కార్యకర్త కన్పిస్తే అరెస్ట్ చేస్తున్నారు.. కార్యకర్తల త్యాగాలు, పోరాటాలవల్లే బీజేపీ ఈస్థాయికి వచ్చింది.. బీజేపీని ఈస్థాయికి తీసుకురావడం నాకు చాలా సంతృప్తిగా ఉంది.. మహిళా కార్యకర్తలు, సంగ్రామ సేన పోరాటాలు భేష్.. పాతబస్తీలో సభ పెట్టి బీజేపీ సత్తా చూపినం.. కిషన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తా… పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం.. ఇకనైనా లేనిపోని ఫిర్యాదులు మానుకోండి…తప్పుడు రిపోర్టులు బంద్ చేయండి.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేయనీయండి.. ఇప్పుడు కాకుంటే మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం కష్టసాధ్యం : బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నర్మగర్భ వ్యాఖ్యలు.. )

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితమంతా మోసాల మయమేనని, ఆయన సంగతి చూసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వర్షాలతో ప్రజలు, రైతులు అల్లాడుతుంటే పట్టించుకోని కేసీఆర్ ఫాంహౌజ్ లో తాగి పడుకుంటూ తమాషా చూస్తున్నారని మండిపడ్డారు. నూతన పీఆర్సీని వేస్తున్నట్లు మీడియాకు లీకులిచ్చి ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. పులిచారల తోలు కప్పుకున్న గుంట నక్క కేసీఆర్… ఎంఐఎం కోసం మైనారిటీలకు రూ.లక్ష సాయం పేరుతో మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఈస్థాయికి తీసుకురావడం తనకు చాలా సంతృప్తి నిచ్చింది.. ఇదంతా కార్యకర్తల త్యాగాలు, పోరాటాలవల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. తనపైనా కొందరు లేనిపోని ఫిర్యాదులు చేశారని…ఇకనైనా వాటిని పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు క్రుషి చేయాలని సూచించారు. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని చురకలంటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా జి.కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ ప్రసంగించారు.

- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మా అన్న కిషన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కిషన్ రెడ్డి కమిట్ మెంట్ ఉన్న నాయకుడు. పార్టీ కార్యాలయంలోనే ఉంటూ కష్టపడి పనిచేస్తూ ఎదిగిన నేత. శాసనసభలో తెలంగాణ వాణిని విన్పించారు. ఉమ్మడి ఏపీసహా మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేసి.. నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మీ నాయకత్వంలో కార్యకర్తలతోపాటు పేదలంతా కుటుంబ పాలనను అంతమొందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషన్ రెడ్డి నిన్ననే యుద్దం స్టార్ట్ చేశారు. కేంద్రం ఇచ్చిన ఇండ్లను పేదలకు ఇవ్వకుండా దారి మళ్లిస్తుంటే వారికి భరోసా కల్పించడానికి డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించడానికి వెళుతుంటే కేంద్ర మంత్రి అని కూడా చూడకుండా కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సమాజం గుర్తించింది. బీజేపీ అంటేనే కేసీఆర్ కు భయం. అందుకే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టబోం. కేసీఆర్ సంగతి చూస్తాం. కేసీఆర్ కు సిగ్గుండాలే.. వర్షాల వల్ల రైతులు అల్లాడుతున్నరు. వారికి పంట నష్టం సాయం చేయలేదు. పేదలను పట్టించుకోవడం లేదు. సచివాలయమంతా వానల్లో ఉంటే కనీసం పట్టించుకోడు. ఫాంహౌజ్ లో తాగి పడుకున్నడు.

ఇప్పుడే సీఎం ఆఫీస్ నుండి లీకేజీ ఇచ్చిండు. పీఆర్సీ వేస్తాడట. ఉద్యోగులను మోసం చేయడానికి మరో కుట్ర చేస్తున్నడు. ఉద్యోగులు కేసీఆర్ మోసాలను గుర్తించి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డిని గెలిపించాడు. ఇయాళ పీఆర్సీ వేస్తున్నాడంటే అది ఏవీఎన్ రెడ్డి ఘనతే. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో డబుల్ ఇండ్లపై పోరాటాలు చేస్తుంటే… రేపో మాపో మీటింగ్ పెట్టి అందరికీ ఇండ్లు ఇస్తానని పేదలను మోసం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. కేసీఆర్ జీవితమంతా మోసాలే… బీసీలందరికీ లక్ష రూపాయలిస్తానని మోసం చేస్తుండు. అట్లాగే ఎంఐఎం వాళ్లు చెప్పారని మైనారిటీలకు కూడా లక్ష ఇస్తామంటూ మరో చెవిలో పూలు పెట్టాలని చూస్తున్నడు. నిరుద్యోగులను, రైతులను, ఉద్యోగులను, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అగ్రకులాలను కూడా మోసం చేస్తున్నడు…. అయినా ప్రజలు నమ్మకపోయేసరికి బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేననే దుష్ర్పచారానికి కేసీఆర్ తెరదీసిండు… గుంట నక్క పులి చారలు వేసుకున్నంత మాత్రాన జనం నమ్మబోరు.
కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒక్కటే. ఎందుకంటే కేసీఆర్ ను కలవడానికి వచ్చిన నాయకులు, పార్టీలన్నీ ఇయాళ కాంగ్రెస్ కూటమి ఇండియాలో భాగస్వాములేనని గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ తో కొట్లాడేది బీజేపీ మాత్రమే. బీజేపీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపిస్తూ జైళ్లకు పంపుతున్నారు. బండి సంజయ్ పార్టీ కార్యకర్త మాత్రమే. నాయకులు ముఖ్యం కాదు.. పార్టీ ముఖ్యం. కార్యకర్తలు ముఖ్యం. మీరందరూ కష్టపడితేనే మేమంతా గెలిచినం. పోలింగ్ బూత్ లో ఇంటింటికీ తిరిగి కమలం పువ్వుకు ఓటేయమని చెబుతూ తిరిగి ఇయాళ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది మీరే. మనందరికీ ఆదర్శం మోదీ. కేసీఆర్ మూర్ఖపు ప్రభుత్వాన్ని ఓడించాలి. రాక్షస రాజ్యం పోవాలి. మోదీ రాజ్యం రావాలని కోరుతూ కమలం.. నా మీద కొందరు ఫిర్యాదులు చేశారు.. అయినా సరే… కార్యకర్తలంతా ఇయాళ బీజేపీ కోసం పనిచేస్తున్నరు. మోదీ పార్టీ ద్వారా మాత్రమే ఎమ్మెల్యేలు కావాలని ఇయాళ బీజేపీలో చేరారు. దయచేసి తప్పుడు ఫిర్యాదులు చేయడం, తప్పుడు రిపోర్టులు ఇయ్యడం బంద్ చేయండి. నమ్ముకుని వచ్చిన నాయకులను, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తల ఆశలను వమ్ము చేయకండి. కిషన్ రెడ్డి సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి. ఆయననైనా ప్రశాంతంగానైనా పనిచేయనీయండి. తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రాకుంటే మళ్లీ కష్టం…. కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నాకు ఎంతో సహకరించారు. కార్యకర్తల కష్టం, పేదల ఆశీర్వాదంవల్ల ‌ఇయాళ పార్టీని ఈస్థాయికి తీసుకొచ్చిన. నాకు చాలా సంత్రుప్తిగా ఉంది. నయా నిజాం పాలనను అంతమొందించాలే… పేదలను, కార్యకర్తలను కాపాడుకోవాలని, మోదీ రాజ్యం తీసుకురావాలనే ఏకైక లక్ష్యం నాది.

నిన్ననే గజ్వేల్ కార్యకర్తలు నావద్దకు వచ్చారు. శివాజీ విగ్రహాన్ని అపవిత్రం చేసిన వాళ్ల వీపు సాఫ్ చేసిన కార్యకర్తలు వాళ్లు. జైలుకు వెళితే నేను వెళ్లిన. వాళ్ళతోపాటు కార్యకర్తలు చేసిన పోరాటం భేష్… బీజేపీ మహిళా కార్యకర్తలు, ప్రజా సంగ్రామ కార్యకర్తల పోరాటం, తెగువ భేష్… తమకు కనీస సౌకర్యాలు లేకపోయినా మోదీ రాజ్యం రావాలి… కేసీఆర్ రాక్షస పాలన పోవాలనే లక్ష్యంతో నాతోపాటు వందల కిలోమీటర్లు నడిచారు. పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ఏ పార్టీ మీటింగ్ పెట్టే సాహసం చేయలేకపోయింది. అమ్మవారి సాక్షిగా అక్కడ బహిరంగ సభ పెట్టి పాతబస్తీ నాదని విర్రవీగిన వాళ్లకు బీజేపీ సత్తా ఏందో చూపినం. మనవల్లే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్లి భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్దకు వెళుతున్నారంటే.. అది బీజేపీ సక్సెస్. రాష్ట్ర అధ్యక్షుడిగా పోరాటాలు చేసిన రెండుసార్లు జైలుకు పోయిన. రైతులు కష్టాలను తీర్చేందుకు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనాలని కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి భరోసా కల్పించిన. ఆనాడు రాళ్ల దాడి చేసినా వాహనాలను ధ్వంసం చేసినా అధైర్యపడలేదు.. దయచేసి మీడియాలో, సోషల్ మీడియాలో ఫోటోలు రావాలని ఆశపడే వారే అక్కడే ఆగిపోతారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లు మాత్రమే పైకి వస్తారు. నమ్మిన సిద్దాంతం కోసం, కిషన్ రెడ్డి నాయకత్వంలో మోదీ రాజ్యాన్ని తీసుకువచ్చి తీరుతాం. ఇప్పటికైనా అందరం కలిసి కట్టుగా సాగితే విజయం బీజేపీదే. మునుగోడులో నైతిక విజయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే… ఒక్కో పోలింగ్ బూత్ ఏజెంట్ కు ఒక్కో మంత్రిని, ఎమ్మెల్యేను పెట్టి వేల కోట్లు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ గెలిచింది. కోమటిరెడ్డిని అనేక ఇబ్బందులు పెట్టింది. కనీసం తిండి కూడా తిననీయకుండా కష్టపెట్టారు. యావత్ రాష్ట్ర యంత్రాంగమంతా తిష్టవేసి చెమటోడ్చినా 10 వేల ఓట్ల మెజారిటీతోనే బీఆర్ఎస్ గెలిచింది అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు