Monday, May 6, 2024

కళారూపాలతో సంచార జాతుల సాంస్కృతిక సేవలు వెలకట్టలేనివి..

తప్పక చదవండి
  • డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు..
  • వీరభద్రీయుల కళారూపాలు తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రతీకలు.
  • సంచార కులాలు, జాతులు ఐక్యతను ప్రదర్శించి హక్కులు సాధించుకోవాలి.
  • వీరభద్రీయులకు ఔఇఈ లుగా ప్రభుత్వం ఆర్ధిక చేయూతను అందిస్తున్నది.
  • మహాత్మా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి, మన పిల్లలను గొప్పగా ఎదిగించాలి.

హైదరాబాద్ : చిన్న కులం, తక్కువ జనం, పేదవాళ్ళం అనే ఆత్మన్యూనత భావం వీడి ఆధునిక అభివృద్ధిని అందుకోవాలని, అన్ని రంగాలలో మహోన్నతంగా ఎదగాలని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయని, వాటి ద్వారా లబ్ది పొందడంలో వెనుకబడకూడదని ఆయన కోరారు. గురువారం స్థానిక మల్లాపూర్ అంబేద్కర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర వీరభద్రీయ సంఘం నూతన కార్యవర్గం పదవీ బాధ్యతల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగిన అభినందన సభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సభాధ్యక్షులుగా ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు డా !! ఉపేందర్ కర్నే వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరభద్రీయులతో సహా, సంచార కులాలు, జాతులు ఒకే సమిష్టి వేదికగా ఏర్పడి హక్కుల సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు. కుల సంఘాలు కార్య వర్గాల ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించుకోవడం ప్రజాస్వామ్యహితమినదే!, అయితే అవి సంఘాల ఐక్యతను దెబ్బతీసేవిగా ఉండరాదని సూచించారు. అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు కాగా అది జాతీయులకు నష్టం కల్గించేలా పరిణమించడం శ్రేయోదాయకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. విద్య ద్వారానే ఎంతటి ఉన్నతిని అయినా సాధించవచ్చును అన్నారు. మహాత్మ జ్యోతిభాఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, వీరభద్రీయ సంఘం రాష్ట్ర, జాతీయ నాయకులు చెవ్వ పాండు, కర్నె శివకుమార్, పన్నాల నాగరాజు, సాంబయ్య, మల్లూరి అనిల్ కుమార్, రావూరి కృష్ణ, చల్లా రాజయ్య, మిర్యాల స్వామి తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు