- పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ కు సంబంధించిన హౌస్ మోషన్ పిటిషన్ విచారణ నేడు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ పిటిషన్ జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందుకు 8వ కేసుగా వచ్చింది. అయితే ఈ కేసును విచారించేందుకు న్యాయమూర్తి సుముఖత చూపలేదు. నాట్ బిఫోర్ మీ చెప్పారు. పిటిషన్ విచారణను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యామ్నాయ మార్గాలకు తన నిర్ణయం అడ్డురాదని జడ్జి తెలిపారు.