Monday, May 6, 2024

పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది

తప్పక చదవండి
  • ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ మేడారం జాత‌ర‌
  • హైద‌రాబాద్ నుండి మేడారంకు రెండువేల బస్సులు
  • మహాలక్ష్మీ పథకం మేడారం జాతరకు వర్తిస్తుంది : భట్టి

హైదరాబాద్ : వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నిజానికి ప్రారంభంలో ఈ జాతర కేవలం గిరిజన ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఆ తరువాత రాష్ట్రం నలుమూలల నుంచి ఈ జాతరకు భక్తులు రావడంతో దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆదివాసీ గిరిజన జాతరగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడారం జాతర పేరొందింది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే గాక ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

మహాలక్ష్మీ పథకం మేడారం జాతరకు వర్తిస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి
ఈ జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందా? లేదా అనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. మహాలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం మేడారం జాతరకు కూడా వర్తింస్తుందని భట్టి స్పష్టం చేశారు.

- Advertisement -

టికెట్లకు డబ్బులు వసూలు చేస్తే సంస్థకు ఆదాయం పెరుగుతుంది – ఆర్టీసీ యాజమాన్యం
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న ఆర్టీసీ రానున్న మేడారం, ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఉచితంగా ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో ఇటీవల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమైన సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్లకు డబ్బులు వసూలు చేస్తే సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమాచారం.

ఆర్టీసీ ప్రతిపాదనను తోసిపుచ్చిన ప్రభుత్వం..
రానున్న మేడారం, ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఉచితంగా ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరస్కరించారు. మహాలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్సు పథకం మేడారం జాతరకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. దేవతలను దర్శించుకోవడానికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం విధానాన్ని అమలు చేయాల్సిందేనని, మేడారం సహా ఏ జాతరకైనా మహిళా ప్రయాణికుల నుంచి టికెట్‌ ఛార్జీలను వసూలు చేయవద్దని తెలిపారు. ఆ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.

మేడారం జాతరకు రెండువేల ఆర్టీసీ బస్సులు : మంత్రి సీతక్క
మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 6,000 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి రెండు వేల సిటీ బస్సులను పంపించే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు