Saturday, May 18, 2024

మొదలైన ఆదిత్య ఎల్1 ప్రయాణం.

తప్పక చదవండి
  • చరిత్ర సృష్టించబోతున్న ఇస్రో!
  • సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య ఎల్1ను ప్రయోగించిన ఇస్రో
  • భూమికి 15 లక్షల కి.మీ. దూరం నుంచి సూర్యుడిపై అధ్యయనం

హైదరాబాద్ : చంద్రయాన్-3 విజయం తర్వాత రోజుల వ్యవధిలోనే సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధమయింది. సూర్యుడిపైకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయాగించింది. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ఆదిత్యను తీసుకుని నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగసింది. సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ-సీ57 ద్వారా పంపింది. మొదటి రెండు దశలు సజావుగా పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 11.10 గంటలకు ప్రారంభమైన 24 గంటల 40 నిమిషాల కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. కౌంట్‌డౌన్ పూర్తయిన తర్వాత సరిగ్గా ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్‌1 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం నాలుగు నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్‌1’ (లగ్రాంజ్‌) పాయింట్‌ను చేరుకోనుంది. ప్రయోగం తర్వాత తొలుత ఆదిత్య-ఎల్‌1ను పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌.. భూ దిగువ కక్ష్యలోకి చేర్చుతుంది. ఆ తర్వాత దాన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇందుకు ఆదిత్య-ఎల్‌1లోని రాకెట్లను ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఎల్‌1 బిందువు వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం (ఎస్‌వోఐ)ను దాటి వెళుతుంది. అనంతరం క్రూయిజ్‌ దశ ప్రారంభమవుతుంది. ఇలా 120 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉపగ్రహం.. ఎల్‌1 బిందువును చేరుకుంటుంది.

భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ప్రదేశం నుంచి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. దీనిలోని మొత్తం ఏడు పేలోడ్‌లు.. సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి. వీటి వల్ల సౌర తుఫానుల నుంచి అంతరిక్షంలోని ఆస్తులను కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

- Advertisement -

ఇక, సూర్యుడి ఉపరితలమైన ఫొటోస్పియర్‌ ఉష్ణోగ్రత దాదాపు 6వేల డిగ్రీల సెల్సియస్‌ కాగా.. దానికి వెలుపల ఉండే కరోనాలో మాత్రం ఏకంగా 10 లక్షల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. వేడిని కలిగించే ఒక వస్తువు నుంచి దూరం జరిగేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కానీ, కరోనాలో అందుకు భిన్నమైన పరిస్థితి. ఉష్ణానికి కారణమైన సూర్యుడిని మించి అక్కడ అత్యంత వేడి ఉంటోంది. అంతుచిక్కని ఈ కారణాలపై ఆదిత్య-ఎల్‌1 దృష్టిసారిస్తుంది. మొత్తం 190 కిలోల బరువున్న ఆదిత్య-ఎల్‌1.. ఐదేళ్ల పాటు సేవలందించేలా రూపొందించారు. భారత్‌ పంపుతున్న తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన ఉపగ్రహం ఇది. సూర్యుడి పుట్టుక, తీరుతెన్నులు, సీఎంఈల గురించి అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఆదిత్య-ఎల్‌1లోని కీలకమైన విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ).. రోజుకు 1,440 ఫోటోలను పంపుతుంది. అంటే.. నిమిషానికి ఒకటి అన్నమాట. ఇది ఆదిత్య-ఎల్‌1లో సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన సాధనం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు